హీరోలు, నిర్మాతల నిర్లక్ష్యమే ఇండస్ట్రీని ముంచుతోంది: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma says heroes and producers negligence is sinking the industry
  • ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఫ్లాప్ సినిమాలు కాదన్న వర్మ
  • ప్రణాళిక లేని మేనేజ్‌మెంట్ వల్ల నిర్మాతలు నష్టపోతున్నారని వ్యాఖ్య
  • సినిమా సూపర్ హిట్ అయితే హీరో, నిర్మాతకు మాత్రమే లాభమన్న ఆర్జీవీ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా సినిమాలు తగ్గించినప్పటికీ, తన ట్రేడ్ మార్క్ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమ పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఫ్లాప్ సినిమాలు కాదని, సరైన ప్లానింగ్ లేకపోవడం, నిర్మాణ సమయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమేనని ఆయన కుండబద్దలు కొట్టారు.


ఈ సందర్భంగా ఒక ఉదాహరణను ప్రస్తావిస్తూ... టాలీవుడ్‌లోని ఒక టాప్ హీరోయిన్ సినిమా షూటింగ్ కోసం ఏకంగా 10 రోజుల పాటు సెట్స్‌లోనే ఉండిపోయారని, అయితే ప్రణాళికా లోపం వల్ల ఆమె కేవలం ఒక్క రోజు మాత్రమే షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చిందని తెలిపారు. పని చేసిన రోజు ఒక్కటే అయినా, ఆమె ఒప్పందం ప్రకారం పూర్తి పారితోషికం వసూలు చేసుకున్నారని ఆర్జీవీ వెల్లడించారు. ఇలాంటి ప్రణాళిక లేని మేనేజ్‌మెంట్ వల్ల నిర్మాతలు అనవసరంగా భారీగా నష్టపోతున్నారని ఆయన విశ్లేషించారు.


అంతేకాకుండా ఫ్లాప్ సినిమాల వల్ల సినీ పరిశ్రమకు జరిగే మేలు గురించి చెబుతూ వర్మ సరికొత్త లాజిక్ తీశారు. ఒక ఫ్లాప్ సినిమా ద్వారా కూడా టెక్నీషియన్లు, దినసరి కూలీలు, చిన్న నటులకు ఉపాధి దొరికి డబ్బు చలామణి అవుతుందని అన్నారు. కానీ ఒక బ్లాక్‌బస్టర్ హిట్ సాధిస్తే, దాని ద్వారా వచ్చే వందల కోట్ల లాభాలు కేవలం సదరు హీరోలు, నిర్మాతలకు మాత్రమే చేరుతాయని స్పష్టం చేశారు. కాబట్టి ఇండస్ట్రీని ముంచుతోంది ఫ్లాప్ సినిమాలు కాదు, హీరోలు-నిర్మాతల నిర్లక్ష్యమేనని తేల్చిచెప్పారు.

Advertisement
Ram Gopal Varma
Tollywood Industry
Film Producers
RGV Latest Interview
Movie Budget Management
Telugu Cinema News

More Telugu News