బాలకృష్ణకు గాయం... జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ స్పందన

Balakrishna injured Jr NTR and Kalyan Ram respond
  • NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణ
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
  • సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెట్టిన హీరోలు
నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆయన సోదరుడి కుమారులు, ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఆకాంక్షించారు. 'NBK111' చిత్ర షూటింగ్‌లో బాలకృష్ణకు స్వల్ప గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు.

"బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని మళ్లీ పూర్తి ఫామ్‌లో గర్జిస్తూ చూడాలని ఎదురుచూస్తున్నాను" అంటూ జూనియర్ ఎన్టీఆర్ 'ఎక్స్' వేదికగా ఆకాంక్షించారు. కల్యాణ్ రామ్ సైతం స్పందిస్తూ, "బాబాయ్ త్వరగా కోలుకోండి. మీరు అతి త్వరలో మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని, మీకు అత్యంత ఇష్టమైన పనిని కొనసాగిస్తారని నమ్ముతున్నాను" అని పేర్కొన్నారు.

కాకినాడలో 'NBK111' చిత్రీకరణ జరుగుతుండగా బాలకృష్ణ కండరానికి స్వల్పంగా గాయమైంది. అయితే, ఆ గాయం స్వల్పమైనదేనని, పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఒక చిన్న సర్జరీ అవసరమని దర్శకుడు గోపీచంద్ మలినేని స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Nandamuri Balakrishna
Jr NTR
Kalyan Ram
NBK111
Gopichand Malineni
Balakrishna injury update

More Telugu News