'లెనిన్'తో అఖిల్ మాస్ కంబ్యాక్.. తొలిరోజే రికార్డు స్థాయి వసూళ్లు!

Akhil Akkineni mass comeback with Lenin record level collections on first day
  • అఖిల్ 'లెనిన్' చిత్రానికి బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్స్
  • తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు
  • అఖిల్ సినీ కెరీర్‌లోనే అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్లు
  • గట్టి కంబ్యాక్ ఇచ్చారంటూ అభిమానుల సంబరాలు
అక్కినేని అఖిల్ తన కెరీర్‌లోనే అత్యంత ముఖ్యమైన విజయాన్ని అందుకున్నారు. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన, 'లెనిన్' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు తొలిరోజు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా 'లెనిన్' సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర‌ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. అఖిల్ నటన, మాస్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ భారీ విజయంపై చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. "అఖిల్ 2.0 వచ్చేశాడు.. బాక్సాఫీస్ గట్టిగా విన్నది. 'లెనిన్' చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారని మరోసారి నిరూపించారు" అంటూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. త‌మన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంతో 'అయ్యగారు గట్టి కంబ్యాక్ ఇచ్చారు' అంటూ అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ వసూళ్ల జోరు చూస్తుంటే.. 'లెనిన్' లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Advertisement
Akhil Akkineni
Lenin Movie Box Office
Lenin Day 1 Collections
Kishore Abburu
Sithara Entertainments
Thaman S

More Telugu News