70 ఏళ్ల వయసులోనూ చిరులో ఏమాత్రం తగ్గని జోష్.. ‘మెగా 158’ కోసం 12 గంటలు ఏకధాటిగా వర్షంలో షూటింగ్‌!

  • బాబీ దర్శకత్వంలోని సినిమా కోసం చిరంజీవి కష్టం
  • వర్షంలో 12 గంటల పాటు ఏకధాటిగా యాక్షన్ సీన్ చిత్రీకరణ
  • చిరు అంకితభావం చూసి ఆశ్చర్యపోయిన చిత్ర బృందం
  • ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్
వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, అంకితభావానికి అది అడ్డుకాదని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు. దాదాపు 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు దీటుగా వరుస సినిమాలు చేస్తూ, తనలోని ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని చాటుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్) సినిమా కోసం పడుతున్న కష్టం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రెండో షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా ఓ భారీ సెట్‌లో స్టంట్ మాస్ట‌ర్లు రామ్‌-ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో వర్షంలో జరిగే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ కోసం చిరంజీవి ఏకధాటిగా 12 గంటల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారు. వర్షంలో తడుస్తూనే అత్యంత కఠినమైన ఫైట్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు.

చిరంజీవి నిబద్ధతపై చిత్ర బృందం ప్రశంసలు కురిపించింది. "ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే వర్కవుట్స్‌తో రోజును ప్రారంభించే చిరంజీవి గారి డెడికేషన్ చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. 12 గంటల పాటు వర్షంలో కష్టమైన యాక్షన్ సన్నివేశాన్ని ఆయన పూర్తి చేశారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు" అని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ చిత్రంలో నివేద పేతురాజు, అనశ్వర రాజన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Chiranjeevi
Mega 158
Bobby Kolli
Ram Lakshman
Tollywood News
Niveda Pethuraj

More Telugu News