ఇరాన్‌పై మూడో రోజూ దాడులు.. అణు విద్యుత్ కేంద్రం సమీపంలో పేలుళ్లు

  • బుషెహర్ అణు కేంద్రం సమీపంలోనూ పేలిన బాంబులు
  • దాడుల్లో అణు కేంద్రంలోని ఓ భవనం దెబ్బతిన్నట్టు సమాచారం
  • హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పే కారణమన్న అమెరికా
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. వరుసగా మూడో రోజు కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. గురువారం దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. కీలకమైన బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంతోపాటు బందర్ అబ్బాస్, కొనారక్ వంటి తీర ప్రాంతాలు ఈ దాడులతో దద్దరిల్లాయి.

ఇవి అమెరికా సైన్యం జరిపిన దాడులేనని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ దాడుల ప్రభావంతో బుషెహర్ అణు కేంద్రంలోని ఒక భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం అందుతోంది.

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపిస్తూ అమెరికా ఈ దాడులు చేపట్టింది. కాల్పుల విరమణ ఒప్పందం "ముగిసిపోయింది" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే ప్రకటించిన విషయం విదితమే.

గడిచిన 48 గంటల్లో ఇరాన్ తీర ప్రాంతాల్లోని దాదాపు 170కి పైగా సైనిక స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది.                                

Iran
USA
Donald Trump
Bushehr Nuclear Power Plant
Strait of Hormuz
US Iran conflict

More Telugu News