01 Thu 09:45 131 మంది కళాకారులు.. 256 గంటల పని.. గౌరీ స్ప్రాట్ పెళ్లి ఉంగరం వెనుక ఇంత కథ ఉందా! కుటుంబ సభ్యుల మధ్య గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్న ఆమిర్ ఖాన్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గౌరీ ధరించిన రూబీ వెడ్డింగ్ రింగ్ మడగాస్కర్ నుంచి తెప్పించిన అరుదైన రూబీ(కెంపు)తో ఈ ఉంగరం తయారీ కెంపును సేకరించడానికే మూడు నెలలకు పైగా సమయం పట్టిన వైనం 256 గంటల పాటు 131 మంది కళాకారుల వర్క్‌తో రూపుదిద్దుకున్న ఉంగరం
02 Thu 09:40 వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు హెచ్చరిక మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో వర్షాల బీభత్సం హెచ్‌పీసీఎల్ బాట్లింగ్ ప్లాంట్ నుంచి కొట్టుకుపోయిన ఎల్పీడీ సిలిండర్లు వాటిలో నింపిన వాటితో పాటు ఖాళీవీ ఉన్నాయి సిలిండర్లను తాకొద్దని కలెక్టర్ హెచ్చరిక గుర్తించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచన
03 Thu 09:39 రుషికొండ భవనాలపై కీలక ప్రకటన.. వినియోగంపై ప్రతిపాదనలకు ఆహ్వానం రుషికొండ భవనాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదన్న ప్రభుత్వం పర్యాటక వినియోగంపై ప్రతిపాదనలు కోరిన ఏపీటీడీసీ ఈ అంశంపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ లీజు వ్యవహారంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు వెల్లడి
04 Thu 09:38 2,300 ఏళ్ల నాటి ప్రాచీన మద్యం లభ్యం.. చైనా సమాధిలో బయటపడిన కాంస్య సీసా! చైనాలోని శంజియాబో శ్మశాన వాటిక తవ్వకాల్లో 2300 ఏళ్ల నాటి కాంస్య సీసా గుర్తింపు శతాబ్దాలు గడిచినా ఆవిరి కాకుండా సీసాలోనే భద్రంగా ఉన్న 15 కప్పుల పురాతన మద్యం ప్రయోగశాల పరీక్షల్లో అది ధాన్యాలతో తయారు చేసిన బీర్ అని వెల్లడి బట్ట, మట్టితో చేసిన రెండు పొరల సీలింగ్ విధానం వల్ల ద్రవం పాడవకుండా రక్షణ నాటి కాలంలో సామాన్యులకు కూడా మద్యం తయారీ సాంకేతికత తెలుసని నిరూపించిన పరిశోధన
05 Thu 09:33 మహదేవ్ యాప్ కేసులో కీలక పరిణామం.. ఒమన్‌లో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు సౌరభ్ చంద్రకర్ ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు ఆధారంగా అరెస్ట్ నిందితుడిని భారత్‌కు రప్పించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా రూ. 6,000 కోట్ల స్కామ్ ఈ కేసులో ఇప్పటికే రూ. 1,700 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
06 Thu 09:30 ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్‌లో విషకీటకం కాటు.. నటుడు రాజేష్ శర్మ పరిస్థితి విషమం.. రేవంత్ రెడ్డికి ఫిర్యాదు! ప్రభాస్ సినిమా షూటింగ్‌లో రాజేష్ శర్మకు కీటకం కాటు తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కోల్‌కతాలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు వెల్లడించిన వైద్యులు షూటింగ్ సెట్‌లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంపై సినీ కార్మిక సంఘం ఆగ్రహం
07 Thu 09:24 రూ.55 లక్షల జపాన్ ఉద్యోగానికి నో చెప్పిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కారణమిదే! అధిక వేతనం కంటే ప్రశాంత జీవనాన్నే ఎంచుకున్న జైపూర్ టెకీ భార్య ఉద్యోగం కూడా అక్కడే ఉండడంతో రిమోట్ ఉద్యోగంపై మొగ్గు జపాన్‌లో మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వస్తుందని వెనక్కి డబ్బుల కంటే కూడా వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యమని అభిప్రాయం సరైన నిర్ణయమంటూ మద్దతు ప్రకటించిన నెటిజన్లు
08 Thu 09:09 ఉగ్రవాద దేశాల జాబితా నుంచి సిరియా అవుట్.. డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక నిర్ణయం! సిరియాను ఉగ్రవాద స్పాన్సర్ దేశాల జాబితా నుండి తొలగించాలని అమెరికా నిర్ణయం కాంగ్రెస్‌కు అధికారికంగా సమాచారం అందించిన విదేశాంగ మంత్రి మార్కో రూబియో 45 రోజుల సమీక్షా గడువు తర్వాత పూర్తిగా తొలగిపోనున్న ఆంక్షలు సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాకు లేఖ రాసిన డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులతో సిరియా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం
09 Thu 09:03 ఒకవైపు గట్టి వార్నింగ్.. మరోవైపు ఇరాన్ డీల్ కోసం ప్రయత్నాలంటున్న ట్రంప్ ఇరాన్‌పై వరుసగా రెండో రోజు అమెరికా వైమానిక దాడులు బహ్రెయిన్, కువైట్, ఖతార్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు ఇరాన్‌ను 20 రెట్లు గట్టిగా దెబ్బతీస్తామన్న అమెరికా అధ్యక్షుడు డీల్ కోసం ఇరాన్ తమతో మాట్లాడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న ట్రంప్ దాడికి ప్రతిదాడి తప్పదంటూ ఇరాన్ నేతల తీవ్ర హెచ్చరికలు
10 Thu 08:35 ‘ఇక చెప్పడానికి మాటలు లేవు’.. మెస్సి చారిత్రాత్మక ప్రదర్శనపై భార్య ఆంటోనెలా ఎమోషనల్ పోస్ట్ వైరల్! ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఈజిప్ట్‌పై 3-2 తేడాతో అర్జెంటీనా ఉత్కంఠభరిత విజయం 0-2తో వెనుకబడిన జట్టును ఒంటిచేత్తో గెలిపించిన మెస్సి వరల్డ్ కప్ చరిత్రలో తన రికార్డును మరింత పొడిగిస్తూ 21వ గోల్, 9వ అసిస్ట్‌ను నమోదు చేసిన మెస్సి 12న జరగబోయే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌తో తలపడనున్న అర్జెంటీనా