01 Thu 09:33 మహదేవ్ యాప్ కేసులో కీలక పరిణామం.. ఒమన్‌లో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు సౌరభ్ చంద్రకర్ ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు ఆధారంగా అరెస్ట్ నిందితుడిని భారత్‌కు రప్పించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా రూ. 6,000 కోట్ల స్కామ్ ఈ కేసులో ఇప్పటికే రూ. 1,700 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
02 Thu 09:30 ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్‌లో విషకీటకం కాటు.. నటుడు రాజేష్ శర్మ పరిస్థితి విషమం.. రేవంత్ రెడ్డికి ఫిర్యాదు! ప్రభాస్ సినిమా షూటింగ్‌లో రాజేష్ శర్మకు కీటకం కాటు తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కోల్‌కతాలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు వెల్లడించిన వైద్యులు షూటింగ్ సెట్‌లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంపై సినీ కార్మిక సంఘం ఆగ్రహం
03 Thu 09:24 రూ.55 లక్షల జపాన్ ఉద్యోగానికి నో చెప్పిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కారణమిదే! అధిక వేతనం కంటే ప్రశాంత జీవనాన్నే ఎంచుకున్న జైపూర్ టెకీ భార్య ఉద్యోగం కూడా అక్కడే ఉండడంతో రిమోట్ ఉద్యోగంపై మొగ్గు జపాన్‌లో మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వస్తుందని వెనక్కి డబ్బుల కంటే కూడా వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యమని అభిప్రాయం సరైన నిర్ణయమంటూ మద్దతు ప్రకటించిన నెటిజన్లు
04 Thu 09:09 ఉగ్రవాద దేశాల జాబితా నుంచి సిరియా అవుట్.. డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక నిర్ణయం! సిరియాను ఉగ్రవాద స్పాన్సర్ దేశాల జాబితా నుండి తొలగించాలని అమెరికా నిర్ణయం కాంగ్రెస్‌కు అధికారికంగా సమాచారం అందించిన విదేశాంగ మంత్రి మార్కో రూబియో 45 రోజుల సమీక్షా గడువు తర్వాత పూర్తిగా తొలగిపోనున్న ఆంక్షలు సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాకు లేఖ రాసిన డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులతో సిరియా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం
05 Thu 09:03 ఒకవైపు గట్టి వార్నింగ్.. మరోవైపు ఇరాన్ డీల్ కోసం ప్రయత్నాలంటున్న ట్రంప్ ఇరాన్‌పై వరుసగా రెండో రోజు అమెరికా వైమానిక దాడులు బహ్రెయిన్, కువైట్, ఖతార్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు ఇరాన్‌ను 20 రెట్లు గట్టిగా దెబ్బతీస్తామన్న అమెరికా అధ్యక్షుడు డీల్ కోసం ఇరాన్ తమతో మాట్లాడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న ట్రంప్ దాడికి ప్రతిదాడి తప్పదంటూ ఇరాన్ నేతల తీవ్ర హెచ్చరికలు
06 Thu 08:35 ‘ఇక చెప్పడానికి మాటలు లేవు’.. మెస్సి చారిత్రాత్మక ప్రదర్శనపై భార్య ఆంటోనెలా ఎమోషనల్ పోస్ట్ వైరల్! ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఈజిప్ట్‌పై 3-2 తేడాతో అర్జెంటీనా ఉత్కంఠభరిత విజయం 0-2తో వెనుకబడిన జట్టును ఒంటిచేత్తో గెలిపించిన మెస్సి వరల్డ్ కప్ చరిత్రలో తన రికార్డును మరింత పొడిగిస్తూ 21వ గోల్, 9వ అసిస్ట్‌ను నమోదు చేసిన మెస్సి 12న జరగబోయే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌తో తలపడనున్న అర్జెంటీనా
07 Thu 08:35 'అతడు చిన్ననాటి స్నేహితుడే.. కానీ విద్వేషంతో ఉండేవారిని కలవను': యోగరాజ్‌పై తొలిసారి స్పందించిన కపిల్ దేవ్ యోగరాజ్ సింగ్ ఆరోపణలపై తొలిసారి స్పందించిన కపిల్ దేవ్ విద్వేషంతో, చేదు అనుభవాలతో ఉండే వారిని కలవడం ఇష్టం ఉండదన్న కపిల్ కొడుకు అంత సక్సెస్ అయ్యాక యోగరాజ్ సంతోషంగా ఉండాలని సూచన గతంలో గన్‌తో తన ఇంటికి వచ్చినట్లు యోగరాజ్ చెప్పిన వైనం యోగరాజ్ తన చిన్ననాటి స్నేహితుడని, పాత మంచి రోజులు గుర్తుంచుకోవాలని వ్యాఖ్య
08 Thu 08:37 మహిళకు వేధింపులు, మోసం.. తెనాలి సీఐ రాములు నాయక్ సస్పెన్షన్ రెండో పెళ్లి చేసుకుని మోసగించాడంటూ సీఐపై మహిళ ఫిర్యాదు మరో మహిళతో సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని ఆరోపణ సాక్ష్యాలుగా ఎస్పీకి ఫొటోలు, వీడియోలు సమర్పించిన బాధితురాలు ఫిర్యాదుపై సీఐ రాములు నాయక్ సస్పెన్షన్
09 Thu 08:13 ఫ్రాన్స్ స్టార్ ఎంబాప్పేపై పరాగ్వే మహిళా ఎంపీ జాత్యహంకార వ్యాఖ్యలు.. బూతు పురాణం! ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాప్పేపై పరాగ్వే సెనేటర్ సెలెస్టే అమరిల్లా తీవ్ర పదజాలంతో దాడి పరాగ్వే గోల్‌కీపర్‌కు ఎంబాప్పే కరచాలనం నిరాకరించాడని ఆరోపణ ఎంబాప్పేను జాత్యహంకార పదాలతో దూషించిన సెనేటర్ లీగల్ నోటీసులు ఇస్తానంటూ సోషల్ మీడియాలో హెచ్చరిక వివాదాలపై దృష్టి పెట్టకుండా క్వార్టర్ ఫైనల్స్‌పైనే ఎంబాప్పే ఫోకస్
10 Thu 07:51 కొత్త విమానాన్ని వదిలేసి పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ ప్రయాణం.. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! నాటో సదస్సు ముగిశాక పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ తిరుగుప్రయాణం ఖతార్ బహుమతిగా ఇచ్చిన సరికొత్త బోయింగ్ 747 విమాన భద్రతపై పెరుగుతున్న అనుమానాలు ఇరాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలోనే విమానం మార్చినట్లు రక్షణ నిపుణుల అంచనా కొత్త విమానంలో క్షిపణి గుర్తింపు, రక్షణ వ్యవస్థలు లేవని వెల్లడి బ్రిటన్ సైనిక స్థావరంలో కొత్త విమానాన్ని పరిశీలించిన అమెరికా సైనికులు