Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజినీకాంత్ 'జైలర్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్... మరోసారి బాక్సాఫీసును షేక్ చేసేందుకు తలైవా రెడీ!

Rajinikanth Jailer 2 release date fixed Thalaiva ready to shake box office again
Advertisement
  • అక్టోబర్ 15న 'జైలర్ 2' ప్రపంచవ్యాప్త విడుదల
  • కొత్త టీజర్‌తో రిలీజ్ డేట్‌ను ప్రకటించిన సన్ పిక్చర్స్
  • భారీ అంచనాల మధ్య వస్తున్న బ్లాక్‌బస్టర్ సీక్వెల్
  • కీలక పాత్రల్లో మోహన్‌లాల్, విజయ్ సేతుపతి 
  • తొలి భాగానికి మించి యాక్షన్ ఉంటుందని అంచనా
Advertisement
సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జైలర్ 2' సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ, కొత్త రిలీజ్ డేట్ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

ఈ టీజర్‌లో విలన్ పాత్రధారి వినాయకన్.. "నన్ను చంపి ప్రశాంతంగా ఉండలేవు. నా వెనుక పెద్ద ప్రపంచం ఉంది జైలర్! ఇది చాలా పెద్ద నెట్‌వర్క్. ఎవరు, ఎప్పుడు, ఎలా వస్తారో కూడా నీకు తెలియదు. నీ జీవితం నరకంగా మారుతుంది" అని హెచ్చరించడం ఉత్కంఠ రేపుతోంది. ఆ తర్వాత రజినీకాంత్ స్టైలిష్‌గా ఎంట్రీ ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంటోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘జైలర్’ చిత్రానికి ఇది సీక్వెల్‌ కావడం విశేషం. తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో రెండో భాగంపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమ్యకృష్ణ, మిర్ణా మీనన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు ఏప్రిల్‌లోనే చిత్రబృందం ప్రకటించింది. తొలి భాగానికి తన సంగీతంతో ప్రాణం పోసిన అనిరుధ్ రవిచందర్ ఈ సీక్వెల్‌కు కూడా స్వరాలు సమకూరుస్తున్నారు.
Advertisement
Advertisement
Rajinikanth
Jailer 2
Nelson Dilipkumar
Sun Pictures
Jailer 2 Release Date
Anirudh Ravichander

More Telugu News