చైనాలో విశాఖ యువకుడు అదృశ్యం
చైనాలో విశాఖపట్నానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. గతేడాది డిసెంబర్లో చైనాకు వెళ్లిన వెంకటేష్ ఆచూకి జనవరి 5 నుంచి తెలియడంలేదని అతడి తల్లిదండ్రులు తెలిపారు. విశాఖపట్నం పోలీసు కమిషనర్, కలెక్టర్కు వారు ఫిర్యాదు చేశారు. వెంకటేష్ తల్లిదండ్రులు విశాఖపట్నంలోని అల్లిపురం వెంకటేశ్వర మెట్టలో నివసిస్తున్నారు.