మనసున్న మహారాజు అశోక్ గజపతిరాజు.. గోవా గవర్నర్‌కు మంత్రి లోకేశ్ బర్త్‌డే విషెస్‌

  • 'ఎక్స్' వేదికగా అశోక్ గజపతిరాజును కొనియాడుతూ ప్రత్యేక పోస్ట్
  • ఆయన్ను విలువల శిఖరంగా, అజాత శత్రువుగా అభివర్ణించిన లోకేశ్
  • విద్యాలయాలకు, ఆధ్యాత్మిక సేవకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న మంత్రి
  • ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్ష
గోవా గవర్నర్, సీనియర్ రాజకీయ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రత్యేక పోస్ట్ చేశారు. అశోక్ గజపతిరాజును 'విలువల శిఖరం', 'మనసున్న మహారాజు' అంటూ లోకేశ్ కొనియాడారు.

"ప్రజాస్వామ్యంలో నిలువెత్తు మానవత్వ రాజసం అశోక్ గజపతిరాజు గారు. విద్యాలయాలకు వేల ఎకరాలు దానమిచ్చిన వితరణశీలి, ఆధ్యాత్మిక సేవకు ఆస్తులు ధారపోసిన ధర్మకర్త, రాజకీయాలలో అందరి మన్ననలు అందుకున్న అజాతశత్రువు" అని లోకేశ్ తన పోస్టులో ప్రశంసించారు.

ప్రజల మనిషిగా వారి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. అశోక్ గజపతిరాజు గారు ఆయురారోగ్యాలతో, ఆనందంగా వందేళ్లు వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తన శుభాకాంక్షల సందేశంలో తెలిపారు.

Ashok Gajapathi Raju
Nara Lokesh
Goa Governor
Andhra Pradesh Politics
Ashok Gajapathi Raju Birthday
TDP Senior Leader

More Telugu News