హోసపేటలో అరుదైన దృశ్యం.. ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్

Rare sight in Hosapete Chandrababu Revanth and DK Shivakumar on one stage
  • హోసపేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం
  • హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
  • పాల్గొన్న కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్
  • 2024 వరదల్లో దెబ్బతిన్న గేట్ల స్థానంలో రూ.51 కోట్లతో నూతన నిర్మాణం
  • ప్రారంభోత్సవానికి ముందు మర్యాదపూర్వకంగా సమావేశమైన నేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటకలోని హోసపేటకు చేరుకున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు రూ.51 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన‌నున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు హోసపేటలోని ఐఆర్‌బీ అతిథి గృహంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, సీఆర్ పాటిల్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. అనంతరం నేతలందరూ కలిసి ప్రాజెక్టు కొత్త గేట్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

2024లో వచ్చిన భారీ వరదలకు తుంగభద్ర డ్యామ్ 19వ నంబర్ గేటు కొట్టుకుపోయింది. అప్పట్లో ప్రత్యామ్నాయంగా స్టాప్ లాక్ గేటును అమర్చారు. అయితే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు శాశ్వత పరిష్కారంగా కొత్త గేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి అయిన రూ.51 కోట్ల వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భరించాయి. ఈ గేట్ల ప్రారంభం అనంతరం జరగనున్న బహిరంగ సభలో నేతలు ప్రసంగించనున్నారు.

Go Back to Shorts
Chandrababu Naidu
Revanth Reddy
DK Shivakumar
Tungabhadra Dam Gates
Hosapete Karnataka
CR Patil Union Minister

More Telugu News