హైదరాబాద్ లోని ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు
- నానక్‌రామ్‌గూడలోని యూఎస్ కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ట్రంప్ పేరు
- ట్రంప్ పేరుకు సైబరాబాద్ నగరపాలక సంస్థ గ్రీన్ సిగ్నల్
- డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేస్తూ తీర్మానం
హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని యూఎస్ కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టేందుకు సైబరాబాద్ నగరపాలక సంస్థ (CMC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు కార్పొరేషన్ల ప్రత్యేక అధికారి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ అధ్యక్షతన మాదాపూర్‌లోని సీఎంసీ (Cyberabad Municipal Corporation) కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గచ్చిబౌలిలోని క్యూ-సిటీ కూడలి నుంచి ఐఆర్‌డీఏ కూడలి వరకు ఉన్న కీలక రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ’గా నామకరణం చేస్తూ సీఎంసీ తీర్మానం చేసింది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రపోజల్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని నిర్ణయించింది. అమెరికా కాన్సులేట్ పక్కనే ఈ రోడ్డు ఉండటం, అంతర్జాతీయంగా హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లీగల్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీఎంసీ పరిధి నుంచి హైడ్రాకు రూ.20.60 కోట్ల నిధులు ఇవ్వాలనే ప్రతిపాదనపై ఈ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన 3 కార్పొరేషన్లలో కూడా ఈ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ అంశం ఇంకా పెండింగులోనే ఉన్నందున, దీనిపై ఒక ఫైనల్ సొల్యూషన్ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలని జయేశ్ రంజన్ నిర్ణయించారు.
సమావేశంలో ఆమోదం పొందిన మరికొన్ని కీలక తీర్మానాలు:
క్రీడా వసతులు: శేరిలింగంపల్లి జోన్‌లోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో సీఎస్సార్ (CSR) నిధులు, పీపీపీ (PPP) పద్ధతిలో ఆధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల డెవలప్‌మెంట్.
గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్: అమెజాన్ (Amazon) సంస్థ భాగస్వామ్యంతో డెలివరీ బాయ్స్, గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ‘ప్రాజెక్ట్ ఆశ్రయ్ - రెస్ట్, వెల్‌నెస్ కేంద్రాలు' ఏర్పాటు.
శ్మశానవాటిక ఆధునికీకరణ: రూ.3 కోట్ల బడ్జెట్‌తో మాదాపూర్‌లోని శ్మశానవాటికను మరింత అభివృద్ధి చేయడం.
వ్యర్థాల క్లియరెన్స్: ఐకియా (IKEA) స్టోర్ సమీపంలో పేరుకుపోయిన భారీ నిర్మాణ వ్యర్థాల కుప్పలకు శాస్త్రీయంగా పరిష్కారం చూపేందుకు ఒక స్పెషల్ కన్సల్టెన్సీ నియామకం.
జీడిమెట్ల వార్డు కార్యాలయాన్ని ఎక్సైజ్ శాఖ అవసరాల కోసం కేటాయింపు.