వడ్డెరలకు ఇచ్చిన హామీని నెరవేర్చాం: నారా లోకేశ్
- క్వారీల్లో వడ్డెరలకు 33 శాతం కేటాయిస్తామని యువగళం సమయంలో లోకేశ్ హామీ
- వడ్డెరలకు 33 శాతం కేటాయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
- తమది చేతల ప్రభుత్వం అన్న లోకేశ్
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, “యువగళం పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశాను. ఆ సమయంలో వడ్డెర సోదరులు తమ కులవృత్తిని కొనసాగించడానికి క్వారీలు కేటాయించాలని నన్ను కోరారు. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈ జీవో జారీ చేశాం” అని తెలిపారు. తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని చెప్పారు.
”కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని అన్నారు. మరోవైపు, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వడ్డెర సంఘాల నేతలు, కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కులవృత్తికి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినందుకు వారు మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.