సీఎం రేవంత్‌ కోసం కేంద్రమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశా: కిషన్‌రెడ్డి

G Kishan Reddy Arranged Meetings with Union Ministers for CM Revanth Reddy
  • రేవంత్‌రెడ్డి రెండుసార్లు లేఖ రాసినట్లు వెల్లడించిన కిషన్‌ రెడ్డి
  • జూన్‌ 22న అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడి
  • ఇవాళ ఖట్టర్‌, అశ్విని వైష్ణవ్‌తో సంయుక్త భేటీ జరిగినట్లు తెలిపారు
  • సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగాయని వెల్లడి
  • తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ కృషి చేస్తానన్న కేంద్ర మంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో రేవంత్‌రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేలా తాను సమన్వయం చేసినట్లు వెల్లడించారు.

జూన్‌ 22న అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం జరిగిందని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ఇవాళ కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, అశ్విని వైష్ణవ్‌తో కలిసి మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగాయని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తనకు రెండుసార్లు లేఖ రాసి కేంద్ర మంత్రులతో భేటీకి అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు.

కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ ప్రతినిధిగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ కృషి చేస్తానని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి అంశాల్లో తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
Go Back to Shorts
G Kishan Reddy
Revanth Reddy
Telangana Development
Ashwini Vaishnaw
Manohar Lal Khattar
Delhi Meetings

More Telugu News