ఏపీఎల్ తుదిపోరుకు మంగళగిరి సర్వం సిద్ధం.. ఏర్పాట్లను తనిఖీ చేసిన ఏసీఏ అధ్యక్షుడు
- మంగళగిరి ఏసీఏ స్టేడియంలో సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల నిర్వహణ
- జూన్ 24 నుంచి 30 వరకు జరగనున్న తుది దశ పోటీలు
- రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమన్న ఏసీఏ
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏర్పాట్లను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పరిశీలించారు. ఏపీఎల్ చివరి దశ మ్యాచ్‌ల నిర్వహణకు స్టేడియం సంసిద్ధతపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఏసీఏ కార్యదర్శి సానా సతీశ్ బాబు, ఇతర అధికారులతో కలిసి కేశినేని చిన్ని మంగళవారం స్టేడియాన్ని సందర్శించారు. పిచ్‌ల పరిస్థితి, క్రీడాకారుల డ్రెస్సింగ్ రూమ్‌లు, జిమ్, కామెంటరీ బాక్స్‌లు, బ్రాడ్‌కాస్టింగ్ సౌకర్యాలతో పాటు ప్రేక్షకుల కోసం చేసిన ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జూన్ 24 నుంచి 30 వరకు సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు ఇక్కడే జరగనున్నాయి.
జూన్ 9న విశాఖపట్నంలో ప్రారంభమైన ఏపీఎల్ టోర్నమెంట్, రెండో దశలో కడపలో కొనసాగి, ప్రస్తుతం ముగింపు దశలో భాగంగా మంగళగిరికి చేరుకుంది. ఈ టోర్నమెంట్ ద్వారా రాష్ట్రంలోని యువ క్రికెట్ ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, క్రీడా పర్యాటకాన్ని, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ఏసీఏ లక్ష్యంగా పెట్టుకుంది.
విశాఖ, కడప, మంగళగిరి స్టేడియాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు కేశినేని చిన్ని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తుది మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా భద్రత, ప్రసారాలు, ఇతర ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఐపీఎల్ తరహాలోనే ఏపీఎల్ లో కూడా ఆటగాళ్లకు వేలం నిర్వహించి, ప్రతిభావంతులైన పేద క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందేలా చూస్తున్నామని కేశినేని చిన్ని పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేశ్ ఆలోచన మేరకు ఐపీఎల్ తరహాలో ప్రతి జట్టుకు ఒక హోమ్ పిచ్ ఉండాలనే ఉద్దేశంతో ఆరు స్టేడియాలను సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ మ్యాచ్‌ల సందర్భంగా క్రికెట్‌తో పాటు మ్యూజికల్ నైట్, ప్రముఖ గాయనీ గాయకులతో వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మ్యాచ్‌లను వీక్షించేందుకు వీలుగా పాస్‌లను ముందుగా ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.