నిద్రిస్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం.. పోలీస్ కాల్పుల్లో నిందితుడికి గాయాలు

Sleeping girl kidnapped and raped suspect injured in police encounter
  • ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఘటన
  • తనిఖీలు చేస్తుండగా పోలీసుల కంటపడిన నిందితుడు
  • పారిపోయేందుకు పోలీసులపైకి కాల్పులు
  • ఎదురు కాల్పుల్లో నిందితుడు ముషారఫ్‌కు గాయాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో బాలికపై జరిగిన అత్యంత అమానుష లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. జూన్ 14న రాత్రి ఒక గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి పైకప్పుపై నిద్రిస్తున్న ఒక బాలికను అదే గ్రామానికి చెందిన ముషారఫ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఆపై ఆమెను సమీపంలోని ఒక పొలంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా సిగరెట్‌తో బాలిక శరీరంపై వాతలు పెట్టాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారవగా, బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పురాముఫ్తీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే జూన్ 21న సాయంత్రం ఫతేపూర్ ఘాట్ నుంచి టిక్రి వైపు వెళ్లే రహదారిపై పోలీసులు సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ముషారఫ్ పోలీసుల కంటపడ్డాడు. 

పోలీసులను చూడగానే నిందితుడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ, తన వద్ద ఉన్న పిస్తోల్‌తో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడి రెండు కాళ్లల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. గాయపడిన నిందితుడు ముషారఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతడి నుంచి ఒక పిస్తోల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బాధిత బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 
Go Back to Shorts
Musharraf
Prayagraj police encounter
Uttar Pradesh crime news
Girl kidnapped and raped
Puramufti police station
UP police encounter

More Telugu News