తలసేమియా పిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకున్న నారా భువనేశ్వరి... ఫొటోలు ఇవిగో!
- ఎన్‌టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో నారా భువనేశ్వరి బర్త్‌డే వేడుకలు
- పిల్లలతో కేక్ కట్ చేసి, వారితో కలిసి భోజనం చేసిన భువనేశ్వరి
- ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత రక్తమార్పిడి, మందుల పంపిణీ
- త్వరలో విజయవాడలో తలసేమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన
- దేశవ్యాప్తంగా బాధితులకు సాయం చేసేందుకు సిద్ధమని స్పష్టం
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విజయవాడలో కొత్తగా తలసేమియా కేర్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆమె మాట్లాడుతూ, "నా పుట్టినరోజును ఈ పిల్లల మధ్య జరుపుకోవడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. తలసేమియా బాధితుల కోసం ఎన్‌టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత రక్తమార్పిడి, అవసరమైన మందులు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. దేశంలో ఎక్కడున్నా సరే బాధితులకు అండగా నిలుస్తాం," అని భరోసా ఇచ్చారు.
తలసేమియా బాధితుల కోసం నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వ్యాధిపై అవగాహన కల్పించేందుకు గతంలో విశాఖ, హైదరాబాద్ నగరాల్లో 'తలసేమియా రన్', విజయవాడలో 'యుఫోరియా మ్యూజికల్ నైట్' వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ వ్యాధిగ్రస్తులకు నెలకు రెండుసార్లు రక్తమార్పిడి అవసరం కాగా, వారికి ఉచితంగా సేవలు అందిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్రకుమార్ (రిటైర్డ్ ఐపీఎస్), సీవోవో అడుసుపల్లి గోపి, హెరిటేజ్ హోల్‌టైమ్ డైరెక్టర్ డా. ఎం. సాంబశివరావు, ట్రస్ట్ మరియు హెరిటేజ్ సిబ్బంది పాల్గొన్నారు.








