పవన్ కల్యాణ్ కు 'ఓజీ2' కథ చెప్పిన సుజీత్.. ఫ్యాన్స్ కు పూనకాలే!

Pawan Kalyan OG 2 movie update Sujeeth begins sequel work
  • పవన్ కళ్యాణ్ 'ఓజీ' సీక్వెల్ (ఓజీ2) పనులు ప్రారంభం
  • దర్శకుడు సుజీత్, పవన్ మధ్య చర్చలు 
  • ఇచ్చిన మాట ప్రకారం ఓజీ యూనివర్స్‌పై దృష్టి పెట్టిన పవన్
  • పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి అధికారిక ప్రకటన
  • సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంబరాలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' సీక్వెల్‌పై కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఓజీ2 కోసం ప్రీ-ప్రొడక్షన్ చర్చలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దర్శకుడు సుజీత్... పవన్ కు ఓజీ2 కథ వినిపించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇచ్చిన మాట ప్రకారం చర్చలు మొదలయ్యాయని, దర్శకుడు సుజీత్ ... పవన్ తో సమావేశంలో పాల్గొన్నారని వెల్లడించింది.

సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ క్రైమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'దే కాల్ హిమ్ ఓజీ' (2025) చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విజన్ తనకు ఎంతగానో నచ్చిందని, దీనిని ఒక యూనివర్స్‌గా (సీక్వెల్స్, ప్రీక్వెల్స్) విస్తరించే ఆలోచన ఉందని పవన్ కళ్యాణ్ గతంలో పలు సందర్భాల్లో తెలిపారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం క్రియేటివ్ వర్క్స్ కార్యాలయంలో దర్శకుడు సుజీత్, పవన్ మధ్య చర్చలు జరగడం ఓజీ2 ప్రాజెక్ట్‌పై కదలిక మొదలైందనడానికి సంకేతంగా నిలుస్తోంది. ఈ వార్త తెలియగానే పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఓజీ2 హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు, మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.


Go Back to Shorts
Pawan Kalyan
Sujeeth
OG 2
They Call Him OG
Pawan Kalyan Creative Works
Telugu Cinema Updates

More Telugu News