బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’.. రెండు రోజుల్లో ఎంత కొల్ల‌గొట్టిందంటే..!

  • సమంత 'మా ఇంటి బంగారం' చిత్రానికి భారీ వ‌సూళ్లు
  • మొదటి రోజు రూ. 13 కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్‌ సాధించిన సినిమా
  • రెండో రోజు మరింత పెరిగి రూ. 15 కోట్లకు పైగా వ‌సూళ్లు
  • మొత్తం రెండు రోజుల్లో రూ. 28 కోట్లు దాటిన క‌లెక్ష‌న్లు
స్టార్ నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 'ఓ బేబీ' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత దర్శకురాలు నందిని రెడ్డి, సమంత కాంబినేషన్‌లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల‌ 19న (శుక్రవారం) విడుదలైన ఈ సినిమా, మొదటి ఆట నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

విడుదలైన మొదటి రోజే రూ. 13 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన 'మా ఇంటి బంగారం', రెండో రోజు శనివారం కూడా తన జోరును కొనసాగించింది. వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగాయి. శనివారం ఒక్కరోజే రూ. 15 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, మొదటి రోజును మించిన వృద్ధిని కనబరిచింది. దీంతో రెండు రోజులకు కలిపి సినిమా మొత్తం రూ. 28 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

సినిమాకు వచ్చిన మంచి టాక్, సమంత నటనకు తోడు వారాంతం కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక, ఈరోజు (ఆదివారం) కూడా సెలవు దినం కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Samantha
Maa Inti Bangaram
Nandini Reddy
Box Office Collections
Telugu Action Thriller
Samantha New Movie

More Telugu News