మహిళల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. పాక్‌ను చిత్తు చేసిన బంగ్లా
- 23 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించిన బంగ్లా మహిళల జట్టు
- టోర్నీలో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి
- బంగ్లా స్పిన్నర్ల ధాటికి కుప్పకూలిన పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్
మహిళల టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ సంచలన విజయం నమోదు చేసింది. శనివారం జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 23 పరుగుల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఈ టోర్నీలో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కాగా, ఆ జట్టు సెమీ ఫైనల్ ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి.
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (36), శోభన మోస్తరీ (22) రాణించగా, ఆఖరి ఓవర్లలో షోర్నా అక్తర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆమె కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్లతో అజేయంగా 39 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించింది. పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా రెండు వికెట్లు పడగొట్టింది.
124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్, ఒక దశలో 64 పరుగులకు 2 వికెట్లే కోల్పోయి పటిష్ఠ స్థితిలో కనిపించింది. ఓపెనర్లు మునీబా అలీ (25), గుల్ ఫిరోజా (23) జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే, ఆ తర్వాత బంగ్లాదేశ్ స్పిన్నర్లు విజృంభించడంతో పాక్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది.
నహిదా అక్తర్ (3 వికెట్లు), సంజిదా అక్తర్ మేఘల (3 వికెట్లు) తమ స్పిన్ ధాటికి పాక్ మిడిలార్డర్‌ను కకావికలం చేశారు. దీంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 100 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో బంగ్లాదేశ్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమి పాలైన పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది.