మెట్రో పెండింగ్ సమస్యలు.. కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ

  • రైల్వే మంత్రితో భేటీకి ఏర్పాట్లు చేయాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి
  • అధికారులు, పత్రాలతో సమావేశానికి హాజరవుతానని వెల్లడి
  • జూన్ 22, 23 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. జూన్ 22, 23 తేదీల్లో తాను ఢిల్లీ పర్యటనలో ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత పత్రాలతో వస్తానని, అధికారులతో కలిసి సమావేశానికి హాజరవుతానని ఆ లేఖలో పేర్కొన్నారు.

ప్రధానంగా మెట్రో మొదటి దశకు సంబంధించిన ఐఆర్‌ఎఫ్‌సీ (ఐఆర్ఎఫ్‌సీ) నిధుల విడుదల, రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులపై చర్చించాల్సి ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగరానికి మెట్రో రైలు అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అని ఆయన ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. పెండింగ్ అంశాలపై త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో వివరించారు.

Revanth Reddy
Kishan Reddy
Hyderabad Metro Rail
Ashwini Vaishnaw
Metro Phase 2 expansion
IRFC funds

More Telugu News