సమంత గర్భవతా..! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
- 'మా ఇంటి బంగారం' సక్సెస్ వేడుకలో పాల్గొన్న సమంత
- వైరల్ అయిన వీడియోతో ప్రెగ్నెన్సీపై ఊహాగానాలు
- ఫిట్‌గా ఉన్న టీషర్ట్‌లో బేబీ బంప్ కనిపించిందంటూ నెటిజన్ల చర్చ
ప్రముఖ కథానాయిక సమంత గర్భవతి అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్ర విజయోత్సవ వేడుకలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ వీడియోలలో సమంతకు బేబీ బంప్ కనిపిస్తోందంటూ నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో సమంత తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి పాల్గొన్నారు. వైట్ టీషర్ట్ ధరించిన సమంత, చిత్ర బృందంతో కలిసి కేక్ కట్ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వీడియోలలో ఆమె గర్భవతిలా కనిపిస్తున్నారంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
గతేడాది సమంత, రాజ్ నిడిమోరుల వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది.
కాగా, బీవీ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన 'మా ఇంటి బంగారం' చిత్రం తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 13 కోట్లు వసూళ్లను రాబట్టి, సమంత కెరీర్‌కు మంచి కంబ్యాక్ ఇచ్చింది.