'మా ఇంటి బంగారం'కు మంచి ఓపెనింగ్స్.. మహిళా ప్రేక్షకులకు సమంత థ్యాంక్స్
- 'మా ఇంటి బంగారం'కు తొలిరోజు భారీ వసూళ్లు
- ప్రపంచవ్యాప్తంగా రూ. 13.15 కోట్లు గ్రాస్ సాధించిన సినిమా
- సినిమా విజయంలో మహిళలదే కీలక పాత్రన్న సమంత
- ఈ చిత్రంలోని స్వర్ణ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని వెల్లడి
సమంత ప్రధాన పాత్రలో నటించి, స్వయంగా నిర్మించిన చిత్రం 'మా ఇంటి బంగారం'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ భారీ విజయం పట్ల సమంత ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సినిమా ఓపెనింగ్స్‌కు మహిళా ప్రేక్షకులు భారీగా తరలిరావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ఈ విజయంపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక నోట్ రాశారు. "మొదటి రోజు ఒక సినిమాకు ఇంత మంచి ఓపెనింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది. యువత నుంచి పెద్దల వరకు అందరూ సినిమాను ఆశీర్వదించడానికి రావడం గొప్ప అనుభూతినిచ్చింది" అని ఆమె పేర్కొన్నారు.
"థియేటర్లకు ఓపెనింగ్స్‌ను మగ ప్రేక్షకులే తెస్తారని చాలాకాలంగా వింటున్నాం. కానీ, ఈ సినిమాకు మహిళలు భారీగా తరలిరావడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సినిమా ప్రేక్షకులు కూడా ఎదుగుతున్నారని అర్థమవుతోంది. మా చిన్న ప్రొడక్షన్ హౌస్ విజయం సాధించింది" అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఇటీవలే ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. 'మా ఇంటి బంగారం'లోని స్వర్ణ పాత్ర తన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని సమంత తెలిపారు. తాను ఇప్పటివరకు చేసిన తెలుగు పాత్రలన్నింటిలో ఇదే తనకు అత్యంత ఇష్టమైనదని చెప్పారు. చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల గురించి మాట్లాడుతూ.. "సినిమాలో స్లో మోషన్ షాట్లు, బిల్డప్ షాట్లు ఉండవు. నిజమైన పంచ్‌లు ఉంటాయి. నాకు కూడా దెబ్బలు తగిలాయి, రక్తం వచ్చింది. అన్ని యాక్షన్ సీన్లను నేనే స్వయంగా చేశాను. అందుకే అవి అంత సహజంగా కనిపిస్తున్నాయి" అని సమంత వెల్లడించారు.