ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ‘ఆపరేషన్ టైగర్’పై ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు!
- షిండే, ఉద్ధవ్ వర్గాల పోటాపోటీ శివసేన వ్యవస్థాపక వేడుకలు
- అసలు సినిమా ముందు ఉందన్న ఏక్‌నాథ్ షిండే
- బాలాసాహెబ్ ఆశయాలను కాంగ్రెస్, ఎన్‌సీపీల వద్ద ఉద్ధవ్ తాకట్టు పెట్టారన్న షిండే
- పదవి నుంచి తప్పుకుంటానని ఉద్ధవ్ థాకరే సంచలన ప్రకటన
శివసేన పార్టీ 60వ వ్యవస్థాపక వేడుకలు ముంబైలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతల నడుమ జరిగాయి. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే ఆశయాలకు తామే అసలైన వారసులమంటూ ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (యూబీటీ) వర్గం విడివిడిగా భారీ బహిరంగ సభలను నిర్వహించాయి.
గోరెగావ్‌లో జరిగిన సభలో ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొన్ని రోజులుగా కొందరు నేతలు తమపై గుంపులుగా మొరుగుతున్నారని, అయితే పులి ఎప్పుడూ ఒంటరిగానే నడుస్తుందని, అదే అసలైన శివసేన అని వ్యాఖ్యానించారు. శివసేన యూబీటీకి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు తమ వైపు రాబోతున్నారనే వార్తలపై స్పందిస్తూ.. ఇది కేవలం ‘ఆపరేషన్ టైగర్’ ట్రైలర్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో అసలు సినిమా చూపించబోతున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వేడుకల వేళ ఇరు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు నడిచాయి. బాలాసాహెబ్ థాకరే బతికి ఉంటే దేశాన్ని గర్వపడేలా చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కచ్చితంగా అభినందించేవారని షిండే పేర్కొన్నారు. ఉద్ధవ్ థాకరే కేవలం అధికారం కోసం శివసేన సిద్ధాంతాలను కాంగ్రెస్, ఎన్‌సీపీల వద్ద తాకట్టు పెట్టారని, తాము చేసిన తిరుగుబాటు వల్లే పార్టీ మళ్లీ సాధారణ ప్రజలకు చేరిందని ఆయన స్పష్టం చేశారు. మహాయుతి కూటమిలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి మహారాష్ట్రలోని ప్రతి గ్రామానికి, ఇంటింటికీ శివసేనను బలంగా తీసుకెళ్తున్నామని చెప్పారు.
మరోవైపు ఉద్ధవ్ థాకరే తన వర్గం సభలో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ వీడి వెళ్తున్న ఎంపీలను ‘ద్రోహులు’గా అభివర్ణించిన ఆయన, ఒకవేళ తన నాయకత్వం నచ్చకపోతే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. ఈ తిరుగుబాటు వెనుక కేంద్ర శక్తుల ప్రమేయం ఉందని, పార్టీని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఉద్ధవ్ స్పష్టం చేశారు.