ఎరువుల ఖర్చు తగ్గించే దారి దొరికిందా?.. రైతులకు ఆశ కలిగిస్తున్న పరిశోధన
- నేలలో కొత్త ఫాస్ఫరస్ నిల్వల గుర్తింపు
- సూక్ష్మజీవుల్లో దాగి ఉన్న పోషకం
- డీఎన్‌ఏ-బౌండ్ ఫాస్ఫరస్‌పై అధ్యయనం
- కొత్త కొలత విధానం అభివృద్ధి
- 32 రకాల నేలలపై పరీక్షలు
- భవిష్యత్ వ్యవసాయానికి కీలక సమాచారం
పంట బాగా రావాలంటే మంచి విత్తనం, నీరు, ఎరువులు అవసరం. కానీ వాటిలోని పోషకాలు నేలలో ఎలా వ్యవహరిస్తాయి? మొక్కలకు అవి ఎలా అందుతాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాన్ని గుర్తించారు. నేలలో ఉండే సూక్ష్మజీవులే పెద్ద మొత్తంలో ఫాస్ఫరస్‌ను తమలో దాచుకుని తిరిగి మొక్కలకు అందేలా చేస్తున్నాయని తాజా పరిశోధన వెల్లడించింది.
వ్యవసాయానికి అత్యంత కీలకమైన పోషకాల్లో ఫాస్ఫరస్ ఒకటి. నత్రజని, పొటాషియం తర్వాత పంటలకు ఎక్కువ అవసరమయ్యే మూలకం ఇదే. వేర్ల పెరుగుదల, పుష్పాలు, గింజల తయారీలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఫాస్ఫరస్ నిల్వలు నేలపై పరిమితంగా ఉన్నాయి. ప్రస్తుతం వ్యవసాయంలో ఉపయోగించే ఫాస్ఫేట్ రాళ్లు పునరుత్పత్తి కాని వనరులు. భవిష్యత్తులో ఇవి తగ్గిపోతే ఎరువుల ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం నేలలోని ‘డీఎన్‌ఏ-బౌండ్ ఫాస్ఫరస్’పై అధ్యయనం చేసింది. ఇది నేలలోని సూక్ష్మజీవుల డీఎన్‌ఏలో ఉండే ఫాస్ఫరస్ రూపం. ఇప్పటి వరకు ఈ ఫాస్ఫరస్ పరిమాణాన్ని గుర్తించడం కష్టంగా ఉండేది. ఇప్పుడు పరిశోధకులు దాన్ని కొలిచేందుకు మరింత సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిని బ్రిటన్‌లోని 32 రకాల నేలలపై పరీక్షించారు.
పరిశోధనలో మరో ఆసక్తికర విషయం బయటపడింది. నేలలోని ఈ ఫాస్ఫరస్ పాత నిల్వల్లో కాకుండా జీవించి ఉన్న సూక్ష్మజీవులతో ముడిపడి ఉందని తేలింది. అంటే ఇది స్థిరంగా ఉండే నిల్వలు కాదు. నేలలోని సూక్ష్మజీవులు నిరంతరం వినియోగిస్తూ మళ్లీ విడుదల చేసే చురుకైన పోషక నిల్వలు.
సాధారణంగా రైతులు నేలలోని ఫాస్ఫరస్‌ను ఎరువుల రూపంలో మాత్రమే చూస్తారు. కానీ వాస్తవానికి నేలలో ఉండే కోట్లాది సూక్ష్మజీవులు కూడా ఈ పోషకాలను నిల్వ చేసి తిరిగి మొక్కలకు అందించే పనిలో కీలకంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయం పూర్తిగా అర్థమైతే భవిష్యత్తులో ఎరువుల వినియోగాన్ని మరింత సమర్థంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. తక్కువ ఎరువులతో ఎక్కువ దిగుబడి సాధించే మార్గాలు కూడా అందుబాటులోకి రావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పటికే అధిక ఫాస్ఫరస్ వినియోగం వల్ల నదులు, చెరువులు కాలుష్యానికి గురవుతున్నాయి. ఆల్గే అధికంగా పెరిగి జలవనరులకు నష్టం కలిగిస్తోంది. ఇలాంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఈ పరిశోధన ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించాల్సిన ఒత్తిడి ఒకవైపు, పరిమిత సహజ వనరులను కాపాడాల్సిన అవసరం మరోవైపు ఉన్న సమయంలో నేల అడుగున కనిపించని ఈ సూక్ష్మ ప్రపంచం భవిష్యత్ వ్యవసాయానికి కీలకంగా మారొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.