విజయ్ దేవరకొండ సినిమాలో హాలీవుడ్ నటుడు.. ఫస్ట్ లుక్ విడుదల
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రణబాలి'
- ఈ సినిమాలో నటిస్తున్న హాలీవుడ్ నటుడు అర్నాల్డ్ వోస్లూ
- 'ది మమ్మీ' సిరీస్ ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వోస్లూ
‘ది మమ్మీ’ సిరీస్‌లో ఇమ్‌హోటెప్ పాత్రతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆర్నాల్డ్ వోస్లూ భారతీయ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నట్టు అతని బర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం ఈ సమాచారాన్ని వెల్లడించింది. చిత్రంలో ఆర్నాల్డ్ వోస్లూ అత్యంత క్రూరమైన నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించనున్నారు.
ఆయన పాత్ర పేరు ‘సర్ థియోడర్ హెక్టర్’ (Sir Theodore Hector). ఈ పాత్ర తీవ్రతను సూచిస్తూ చిత్ర బృందం ఆయనకు ‘ది డెమోన్ ఆఫ్ డ్రాట్’ (The Demon of Drought) అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌ను ఇచ్చింది.
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-బడ్జెట్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా, నిరవ్ షా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘రణుబాలి’ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ ఎంట్రీతో ఈ చిత్రం మీద అంచనాలు ఒక్కసారిగా స్కై హైకి చేరాయి.