సింగపూర్ లో మంత్రి నారాయణ బర్త్ డే సెలబ్రేట్ చేసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

  • సింగపూర్ పర్యటనలో మంత్రి నారాయణ పుట్టినరోజు వేడుకలు
  • స్వయంగా శుభాకాంక్షలు చెప్పి వేడుక జరిపిన సీఎం చంద్రబాబు
  • ముఖ్యమంత్రి ఆత్మీయత తనను ఎంతగానో కదిలించిందన్న నారాయణ
  • ఏపీ అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అధికారిక పర్యటనలో బిజీగా ఉన్నప్పటికీ, తన సహచర మంత్రి పట్ల సీఎం చంద్రబాబు చూపిన ఆత్మీయత అందరినీ ఆకట్టుకుంటోంది. సింగపూర్‌లో మంత్రి నారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి స్వయంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, వేడుక నిర్వహించారు.

ముఖ్యమంత్రి చూపిన ఈ ఆత్మీయతకు మంత్రి నారాయణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మధుర క్షణాలను ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. "ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కీలక పెట్టుబడుల ఆకర్షణ కోసం ఉన్నత స్థాయి చర్చల్లో నిమగ్నమై ఉన్న తరుణంలో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నా పుట్టినరోజును గుర్తుపెట్టుకుని వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలపడం నన్ను ఎంతగానో కదిలించింది" అని నారాయణ తన పోస్టులో పేర్కొన్నారు.

"విద్యా రంగంలో ఒక చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన నా ప్రస్థానం, ఆయన నాపై ఉంచిన నమ్మకంతో నేడు ఒక గురుతర బాధ్యతగా మారింది. ఆంధ్రప్రదేశ్ పురోగతి, శ్రేయస్సు కోసం మరింత అంకితభావంతో పనిచేస్తాను" అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకోగా, ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

.

Chandrababu Naidu
Ponguru Narayana
Singapore
Andhra Pradesh
Minister Narayana Birthday
AP CM Singapore Visit

More Telugu News