మమతతోనే ఉంటా.. వాళ్లతో కలిసే ఆలోచనే లేదు: శత్రుఘ్న సిన్హా

Shatrughan Sinha will stay with Mamata and has no plans to change party
  • మమతకే తన పూర్తి మద్దతన్న సిన్హా
  • పార్టీతోనే కొనసాగుతానని స్పష్టీకరణ
  • రెబెల్‌ గ్రూప్‌తో చేరనున్నట్లు వచ్చిన ప్రచారంపై ఖండన
  • మమతకు భారీ ప్రజా మద్దతు ఉందన్న వ్యాఖ్య
తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల చర్చ నడుస్తున్న వేళ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టీఎంసీ తిరుగుబాటు వర్గంలో చేరనున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. టీఎంసీతోనే కొనసాగుతానని, మమతా బెనర్జీకే తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

మమతా బెనర్జీ ఇప్పటికీ ప్రజల్లో బలమైన ఆదరణ కలిగిన నాయకురాలని శత్రుఘ్న సిన్హా అన్నారు. ప్రజల మధ్య ఉంటూ పోరాడే నాయకురాలిగా ఆమె మరోసారి నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆమెకు భారీ ప్రజా మద్దతు ఉందని చెప్పారు. తాను ఆమె వెంటే ఉన్నానని, తృణమూల్‌ కాంగ్రెస్‌తో తన ప్రయాణం కొనసాగుతుందని సిన్హా స్పష్టం చేశారు. పార్టీని వీడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.

ఇటీవల టీఎంసీలో కొందరు నేతలు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన కూడా రెబెల్‌ గ్రూప్‌తో చేరనున్నట్లు వస్తున్న ఊహాగానాలకు దీంతో కొంతవరకు చెక్‌ పడినట్టయింది.
Go Back to Shorts
Shatrughan Sinha
Mamata Banerjee
Trinamool Congress
TMC internal rift
West Bengal politics
Shatrughan Sinha TMC statement

More Telugu News