మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్ సూచీ
నష్టాల్లోకి జారుకున్న జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ
మెటల్, రియల్టీ షేర్లలో భారీగా అమ్మకాలు
రాణించిన ఎఫ్ఎమ్సీజీ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లు
లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
నష్టాల్లోకి జారుకున్న జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ
మెటల్, రియల్టీ షేర్లలో భారీగా అమ్మకాలు
రాణించిన ఎఫ్ఎమ్సీజీ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లు
లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
నిఫ్టీ షేర్లలో హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ మీడియా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ రంగాలు నష్టాలు మూటగట్టుకున్నాయి. దీనితో పాటు మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ షేర్లపై విక్రయాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ మిడ్-క్యాప్ సూచీ 1.49 శాతం, నిఫ్టీ స్మాల్-క్యాప్ సూచీ 1.33 శాతం చొప్పున పతనమై ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
కొన్ని దిగ్గజ షేర్లు భారీ నష్టాల నుంచి మార్కెట్లను గట్టెక్కించాయి. సెన్సెక్స్‌లో హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల బాట పట్టి సూచీని గ్రీన్ జోన్లో నిలబెట్టాయి. ముఖ్యంగా నిఫ్టీ ఎఫ్ఎమ్సీజీ సూచీ ఒక శాతానికి పైగా లాభపడగా ప్రైవేట్ బ్యాంకులు, కెమికల్ రంగాలు కూడా రాణించాయి.