బాలయ్యకు అల్లుడు లోకేశ్, కుమార్తె బ్రాహ్మణిల ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు

Special birthday wishes to Balayya from son-in-law Lokesh and daughter Brahmani
  • భోళాతనానికి ప్రతిరూపం బాలా మావయ్య అంటూ లోకేశ్ ట్వీట్
  • నాన్నే నా సూపర్ హీరో అంటూ బ్రాహ్మణి భావోద్వేగ పోస్ట్
  • బాలయ్య వందేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించిన కుటుంబ సభ్యులు
నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అల్లుడు, మంత్రి నారా లోకేశ్, కుమార్తె నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా తమ తండ్రికి ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

"నిండైన తెలుగుదనం, అభిమానం, భోళాతనానికి ప్రతిరూపం మా బాలా మావయ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ లోకేశ్ పోస్ట్ చేశారు. బాలకృష్ణను అభిమానుల పాలిట 'గాడ్ ఆఫ్ మాసెస్' అని, క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచే 'ఆపన్న హస్తం' అని కొనియాడారు. హిందూపురం ప్రజా విజేత అయిన బాలకృష్ణ ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.

ఇక బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి తన తండ్రిని సూపర్ హీరోగా అభివర్ణిస్తూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న! చిన్నప్పుడు నేను సూపర్ హీరో కోసం ఎక్కడో వెతకలేదు, మిమ్మల్ని చూస్తే చాలు. మీ అభిరుచి, పట్టుదలే నన్ను ఈ రోజు ఇలా తీర్చిదిద్దాయి. నాకు అండగా, గురువుగా, గొప్ప స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు. మీ కుమార్తెగా పుట్టడం నా అదృష్టం" అని బ్రాహ్మణి తన పోస్టులో పేర్కొన్నారు. రాబోయే ఏడాది మొత్తం ఆయన మంచి ఆరోగ్యం, సంతోషంతో గడపాలని ఆకాంక్షించారు. 
Go Back to Shorts
Nandamuri Balakrishna
Nara Lokesh
Nara Brahmani
Balakrishna Birthday
God of Masses
Hindupur MLA

More Telugu News