నిర్మాతగా మారిన నాగచైతన్య.. కీలక పాత్రలో భూమిక చావ్లా

Naga Chaitanya turns producer as Bhumika Chawla joins Dhootha 2 cast
  • 'దూత' సీక్వెల్ షూటింగ్ ప్రారంభం
  • ఈ సిరీస్ ద్వారా నిర్మాత అవతారమెత్తిన చైతూ
  • ఎనిమిదేళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చైతూ, భూమిక

అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘దూత’ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ‘దూత-2’ పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టారు. ఈ సిరీస్ ద్వారా నాగచైతన్య సరికొత్తగా నిర్మాత అవతారమెత్తడం విశేషం. చైతన్య నిర్మిస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇదే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న ఈ సీజన్‌కు కూడా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.


ఫస్ట్ సీజన్‌లోని పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ ఈసారి కూడా అలరించనున్నారు. కాగా, ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో ప్రముఖ నటి భూమిక చావ్లా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. గతంలో వీరిద్దరూ ‘సవ్యసాచి’ (2018) లో కలిసి నటించారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Go Back to Shorts
Naga Chaitanya
Dhootha 2
Bhumika Chawla
Vikram K Kumar
Amazon Prime Video
Naga Chaitanya Producer Debut

More Telugu News