జనాభాను తగ్గిస్తున్న స్మార్ట్ ఫోన్లు.. పరిశోధనల్లో షాకింగ్ నిజాలు!
- స్మార్ట్ఫోన్ల వల్ల తగ్గిన ప్రత్యక్ష సామాజిక సంబంధాలు
- 2007 తర్వాత పడిపోతూ వచ్చిన సంతానోత్పత్తి రేటు
- ఫోన్ల స్క్రీన్ల ముందే గడుపుతున్న యువత
- 128 దేశాల్లో ఒకేలా ఉన్న ట్రెండ్
- భారత్‌లోనూ వేగంగా తగ్గుతున్న జననాల రేటు
ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా జీవన ప్రమాణాలు మెరుగైనప్పుడు లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు జననాల రేటు తగ్గడం సహజం. కానీ గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఒక వింత ధోరణి కనిపిస్తోంది. దేశాల ఆర్థిక, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా 2007 తర్వాత అన్ని చోట్లా ఒకేలా సంతానోత్పత్తి రేటు పడిపోతోంది.
దీనికి గల కారణాలపై అమెరికాకు చెందిన ‘నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్’, సిన్సినాటి విశ్వవిద్యాలయం చేసిన రెండు తాజా పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనం వాడుతున్న ‘ఐఫోన్’ లేదా స్మార్ట్ఫోన్లు ఈ జనాభా తగ్గుదలకు ఓ ప్రధాన కారణమని అధ్యయనాలు తేల్చాయి.
అమెరికాలో 1980 నుంచి 2007 వరకు ప్రతి వెయ్యి మంది మహిళలకు 65 నుంచి 70 ప్రసవాలు జరుగుతూ స్థిరంగా ఉండేవి. కానీ 2007 తర్వాత ఈ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోతూ వచ్చి 2024 నాటికి 54కు చేరుకుంది. అంటే దాదాపు 17 ఏళ్లలో 22 శాతం క్షీణత నమోదైంది. దీనికి 2008 నాటి ఆర్థిక మాంద్యం కారణమని మొదట్లో భావించినప్పటికీ.. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నా జననాల రేటు మాత్రం పెరగలేదు. దీంతో పరిశోధకులు 2007లో సరిగ్గా ఐఫోన్ విడుదలైన సమయాన్ని ఆ తర్వాత మారిన డిజిటల్ విప్లవాన్ని పరిశీలించారు.
ఆరంభంలో (2007-2011) అమెరికాలో ఐఫోన్ కేవలం ‘AT&T’ నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లోనే లభించేది. ఈ అవకాశాన్ని పరిశోధకులు ఒక ప్రయోగంగా తీసుకుని ఈ నెట్వర్క్ ఉన్న కౌంటీలను, లేని కౌంటీలతో పోల్చి చూశారు. ఐఫోన్ నెట్వర్క్ విరివిగా ఉన్న ప్రాంతాల్లో 15 నుంచి 19 ఏళ్ల యువతుల్లో ప్రసవాల రేటు 4.5 నుంచి 8 శాతం వరకు, అలాగే 20 నుంచి 24 ఏళ్ల మహిళల్లో 3.2 నుంచి 6.6 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. ఈ గణాంకాలను బట్టి 2007-2011 మధ్య కాలంలో అమెరికాలో తగ్గిన మొత్తం జనాభా రేటులో 33 నుంచి 52 శాతానికి ఐఫోన్ లేదా స్మార్ట్‌ఫోన్ వాడకమే కారణమని తేలింది.
స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత యువత ఒకరినొకరు నేరుగా కలుసుకోవడం, స్నేహితులతో సమయం గడపడం భారీగా తగ్గించేశారు. 2003లో రోజుకు సగటున 68 నిమిషాలుగా ఉన్న ప్రత్యక్ష సామాజిక సంబంధాలు.. 2019 నాటికి కేవలం 38 నిమిషాలకు (44 శాతం) పడిపోయాయి. అదే సమయంలో కంప్యూటర్లు, ఫోన్ల స్క్రీన్ల ముందు గడిపే సమయం 22 నిమిషాల నుంచి 96 నిమిషాలకు (336 శాతం) పెరిగింది. దీనివల్ల భాగస్వాముల మధ్య శారీరక సంబంధాలు తగ్గడం, మరోవైపు అశ్లీల చిత్రాల వీక్షణ విపరీతంగా పెరిగిందని పరిశోధకులు తేల్చారు. అలాగే ఫోన్ల ద్వారా గర్భనిరోధక సాధనాలు, అబార్షన్లపై అవగాహన పెరగడం కూడా ఇందుకు దోహదం చేసింది.
సిన్సినాటి విశ్వవిద్యాలయ ఆర్థికవేత్తలు వరల్డ్ బ్యాంక్ డేటాను ఉపయోగించి 128 దేశాల్లోని పరిస్థితులను అధ్యయనం చేశారు. వివిధ రకాల ఆరోగ్య వ్యవస్థలు, మతపరమైన సంప్రదాయాలు, చట్టాలు ఉన్న ఇరాన్, కోస్టారికా, మెక్సికో, టర్కీ, చిలీ వంటి దేశాల్లో కూడా స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగిన తర్వాతే టీనేజ్ ప్రసవాల రేటు వేగంగా పడిపోయిందని కనుగొన్నారు. దీన్ని ఒక ‘‘గ్లోబల్ టెక్నాలజీ షాక్’’గా వారు అభివర్ణించారు.
ప్రస్తుతం ధనిక దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న భారత్, బ్రెజిల్ వంటి మధ్యాదాయ దేశాల్లోనూ సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గుతోంది. 2024 నాటికి కెనడాలో ఈ రేటు 1.25కు పడిపోగా.. జపాన్, సింగపూర్, స్పెయిన్, దక్షిణ కొరియా దేశాలు ఇప్పటికే జనాభా క్షీణతతో అల్లాడిపోతున్నాయి. చైనా కూడా తన ‘వన్ చైల్డ్’ పాలసీని మార్చుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ స్మార్ట్ఫోన్ల యుగంలో మారుతున్న మనుషుల ప్రాధాన్యాలు, జీవనశైలే ప్రపంచవ్యాప్తంగా జనాభా సంక్షోభానికి దారితీస్తోందని ఈ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.