‘పెద్ది’ వివాదంపై జయా బచ్చన్‌ ఘాటు వ్యాఖ్యలు!

Jaya Bachchan reacts sharply to Peddi movie controversy
  • పెద్దిలో జాన్వీ కపూర్‌ను చూపించిన విధానంపై వివాదం
  • మహిళలను అందాల వస్తువుగా చూడొద్దంటూ హితవు
  • ఘాటుగా స్పందించిన సీనియర్ నటి జయా బచ్చన్‌
  • కరీనా కపూర్‌ సైతం ఆగ్రహం
  • అందం కోసం బట్టలు పొట్టిగా చేయాల్సిన అవసరం లేదని సూచన
రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను మితిమీరిన గ్లామరస్‌గా చూపించడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. దీనిపై సీనియర్ నటి, ఎంపీ జయా బచ్చన్ తీవ్రంగా స్పందించారు. సినిమాల్లో మహిళలను కేవలం ఒక అందాల వస్తువులా చూపించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ‘డెక్కన్ క్రానికల్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని కూడా పంచుకున్నారు.

ఓ దర్శకుడు తనను కూడా ఇలాగే మితిమీరిన గ్లామరస్‌గా చూపించడానికి ప్రయత్నించాడని జయా బచ్చన్ గుర్తుచేసుకున్నారు. ‘‘అప్పుడు నేను వెంటనే అభ్యంతరం తెలిపాను. నా సెట్‌లో అలాంటి పనులు సాగనివ్వలేదు. ఆ తర్వాత మరే దర్శకుడూ నాతో ఆ గీత దాటడానికి ధైర్యం చేయలేదు. నన్ను కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం చేయాలని చూసిన ఆ దర్శకుడితో నేను మళ్లీ ఎప్పుడూ పని చేయలేదు’’ అని ఆమె స్పష్టం చేశారు. మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘షోర్’ సినిమా షూటింగ్ సమయంలో ఈ గొడవ జరిగినట్లు సమాచారం.

ఈ వివాదంపై స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ కూడా గట్టిగా స్పందించారు. తెరపై శృంగార రసాన్ని లేదా అందాన్ని పండించడానికి బట్టలు తగ్గించాల్సిన అవసరం లేదని ఆమె హితవు పలికారు. ‘‘కభీ ఖుషీ కభీ గమ్’ సినిమాలో ఓ పాటలో కాజోల్‌ను చూడండి.. లేదా ‘చాందినీ’లో శ్రీదేవిని చూడండి. వారు ఎలాంటి స్కిన్ షో చేయకుండా చీరల్లోనే అద్భుతంగా కనిపించారు. ‘ఆరాధన’ సినిమాలో మా అత్త షర్మిలా ఠాగూర్ తల నుంచి కాలి వరకు బట్టలు కప్పుకునే ఉంటారు. అయినా ఆ పాట ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలుసు’’ అని కరీనా పేర్కొన్నారు.
Go Back to Shorts
Jaya Bachchan
Peddi Movie Controversy
Janhvi Kapoor
Kareena Kapoor Khan
Ram Charan
Women Objectification in Cinema

More Telugu News