క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. టాలీవుడ్ నటుడు సుప్రీత్‌పై కేసు నమోదు
- రోడ్డుకు అడ్డంగా కారు పెట్టావంటూ డ్రైవర్‌తో వాగ్వాదం
- బాధితుడిని కొట్టి, ఫోన్ లాక్కున్నారని ఫిర్యాదులో ఆరోపణ
- కీసర పోలీస్ స్టేషన్‌లో సుప్రీత్‌పై కేసు నమోదు
- 'ఛత్రపతి' చిత్రంలో కాట్రాజ్ పాత్రతో సుప్రీత్ సుపరిచితుడు
పోలీసుల కథనం ప్రకారం, వనస్థలిపురం నుంచి కుందన్‌పల్లికి ట్రిప్ పూర్తి చేసిన డ్రైవర్ శ్రీహరి, నాగారం చౌరస్తా వద్ద రోడ్డు పక్కన కారును నిలిపి తదుపరి బుకింగ్ కోసం వేచి చూస్తున్నాడు. అదే సమయంలో ఫార్చ్యూనర్ కారులో అటుగా వచ్చిన నటుడు సుప్రీత్ రెడ్డి, వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా ఎందుకు పెట్టావంటూ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో తనను అసభ్య పదజాలంతో దూషించి, భౌతికంగా దాడి చేయడమే కాకుండా తన మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారని శ్రీహరి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంటనే బాధితుడు 'డయల్ 100'కు ఫోన్ చేసి పోలీసుల సహాయం కోరాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సుప్రీత్‌పై కేసు నమోదు చేశారు. 'ఛత్రపతి' చిత్రంలో 'కాట్రాజ్' పాత్రతో గుర్తింపు పొందిన సుప్రీత్, పలు తెలుగు, తమిళ సినిమాల్లో విలన్‌గా నటించారు.