15 ఏళ్లకే సంచలనం.. భారత జట్టులో చోటు.. కానీ అసలు ప్రశ్న అదే!: ఏబీ డీవిలియర్స్
- 15 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ
- వైభవ్‌ను అద్భుతమైన ప్రతిభావంతుడిగా అభివర్ణించిన డివిలియర్స్
- అయితే అతను టెస్ట్ క్రికెట్ ఆడతాడనే నమ్మకం లేదని వ్యాఖ్య
- యువ క్రికెటర్‌ను జట్టులోకి తీసుకోవడం సెలక్టర్ల సాహసోపేత నిర్ణయమన్న ఏబీడీ
క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ సీజన్లో సంచలన ప్రదర్శనతో దాదాపు 776 పరుగులు సాధించి, టోర్నమెంట్ చరిత్రలోనే ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ అద్భుతమైన ఫామ్‌తో సెలక్టర్లను మెప్పించి, ఏకంగా భారత జాతీయ జట్టుకు పిలుపు అందుకున్నాడు. తద్వారా భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్‌కు ముందే వైభవ్ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఏజ్-గ్రూప్ క్రికెట్, దేశవాళీ సర్క్యూట్‌తో పాటు అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ కీలక పాత్ర పోషించి రికార్డులు నెలకొల్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తన సత్తా చాటినప్పటికీ, అసలైన టెస్ట్ క్రికెట్ (రెడ్-బాల్) ఆడటంపై అతనికి ఎంతవరకు ఆసక్తి ఉందనే చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ఆల్-ఫార్మాట్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్.. వైభవ్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌ను 'అద్భుతమైన ప్రతిభావంతుడు' అని ప్రశంసించినప్పటికీ, అతని టెస్ట్ కెరీర్‌పై సందేహాలు వ్యక్తం చేశాడు.
"అతను రెడ్-బాల్ క్రికెట్ ఆడగలడా? లేదా? అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. అతను ఆడాలనుకుంటే ఆడగలడు. కానీ, అసలు ప్రశ్న అదే.. అతనికి నిజంగా టెస్టులు ఆడాలనే కోరిక ఉందా? దానికి కాలమే సమాధానం చెబుతుంది. అతనిలో నైపుణ్యం, సామర్థ్యాలకు కొదవ లేదు. ఒకవేళ అతను టెస్ట్ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకుంటే, కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించే సత్తా అతనిలో ఉంది. వ్యక్తిగతంగా అతను టెస్టులు ఆడాలని నేను కోరుకుంటున్నాను. కానీ, అతను ఆడతాడనే నమ్మకం నాకు లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం" అని డివిలియర్స్ పేర్కొన్నాడు.
అయితే, వైభవ్‌ను భారత జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయమేనని డివిలియర్స్ స్పష్టం చేశాడు. "ఇది సెలక్టర్లు తీసుకున్న సరైన, సాహసోపేతమైన నిర్ణయం. అతను ఇంకా చిన్నవాడని చెప్పి పక్కన పెట్టడం సులువే. కానీ, అతను తన ప్రదర్శనతో ఆ తలుపులు బద్దలు కొట్టాడు. భారత టీ20 జట్టులో తన స్థానానికి పూర్తిగా అర్హుడు" అని ఏబీడీ ప్రశంసించాడు.