నెతన్యాహుకు వేరే ఛాన్స్ లేదు.. ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
- ఇరాన్‌తో చర్చలు కొనసాగుతాయన్న ట్రంప్
- ఒప్పందానికి నెతన్యాహు అంగీకరించాల్సిందేనన్న అమెరికా అధ్యక్షుడు
- ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌పై దాడులు ఉంటాయని హెచ్చరిక
- ఆర్థిక ఆంక్షలూ ఉంటాయని స్పష్టీకరణ
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చలు ముగించాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఈ శాంతి ప్రక్రియలో తనదే తుది నిర్ణయమని ట్రంప్ స్పష్టం చేశారు. ‘‘ఇక్కడ అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటాను. నెతన్యాహు కాదు. భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరే ఒప్పందాన్ని ఆయన అంగీకరించి తీరాల్సిందే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్ సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని ఆదివారం రాత్రి ఇరాన్ భారీగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. అంతకుముందు లెబనాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ దళాలు బీరుట్ శివార్లలో దాడులు చేశాయి. దీనికి ప్రతికారంగానే ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది.
ఇరాన్‌పై ఎదురుదాడి చేయొద్దని నెతన్యాహును ట్రంప్ కోరనున్నట్లు సమాచారం. ఇలాంటి సైనిక చర్యల వల్ల ప్రస్తుతం జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు దెబ్బతింటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌ను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ..‘‘మీరు క్షిపణులు ప్రయోగించారు. ఇక చాలు. ఇప్పుడైనా చర్చలకు వచ్చి ఒప్పందం చేసుకోండి’’ అని పిలుపునిచ్చారు. అలాగే బీరుట్‌పై ఇజ్రాయెల్ చేసిన ముందస్తు దాడులపై కూడా ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఒకవేళ దౌత్యపరమైన చర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరించారు. చర్చలు ఫలించకపోతే ఇరాన్‌పై కమాండో దాడులు చేసే ఆలోచన కూడా ఉందన్నారు. ‘‘మేం ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాం. ఒకవేళ ఇరాన్ వినకపోతే వారిపై బాంబులతో విరుచుకుపడతాం’’ అని ఎన్‌బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలతో పాటు సైనిక ఒత్తిడిని కూడా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.