'సింగ్ గీతం'.. 20 ఏళ్లప్పుడు విన్న కథ, 70 ఏళ్లకు చూస్తున్నా: కమల్ హాసన్

Entertainment
Advertisement
  • 'సింగ్ గీతం' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కమల్ హాసన్
  • 20 ఏళ్ల వయసులో విన్న కథ ఇప్పుడు సినిమాగా వస్తోందని వెల్లడి
  • సింగీతం గారికి ఇప్పటికీ సహాయ దర్శకుడిగా ఉండటానికి ఇష్టపడతానన్న కమల్
  • రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మించి ఉంటే బాగుండేదని అనిపించిందని వ్యాఖ్య
  • ప్యాషన్‌తో సినిమా తీస్తే ఊహించని విజయం వస్తుందని ఉద్ఘాటన
Advertisement
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన వెరైటీ కథా చిత్రం 'సింగ్ గీతం'. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ప్రధాన పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, చెన్నైలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై, దర్శకుడు సింగీతంతో తనకున్న అనుబంధాన్ని, ఆయన ప్రతిభను కొనియాడారు.

ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ, "మాయాబజార్ నుంచి ఇప్పటి సింగ్ గీతం వరకు సింగీతం గారిలో మార్పు లేదు. సినిమా ఆయనతోనే ఉంది. ఇది చాలా అరుదు. నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఆయనతో పనిచేయడం మొదలుపెట్టాను. ఆయన సినిమాకు నిర్మాతగా, సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాను. చాలా ఏళ్ల క్రితం ఆయన నాకు రెండు కథలు చెప్పారు. ఒకటి 'పుష్పక విమానం'గా వచ్చింది. ఇప్పుడు రెండో కథ 'సింగ్ గీతం'గా రాబోతోంది. అప్పుడు నాకు 20 ఏళ్లు, ఇప్పుడు 70. ఇన్నాళ్లకు ఆ సినిమాను చూడబోతున్నాను. కొన్ని ఆలోచనలు, కథలు టైమ్‌లెస్‌గా ఉంటాయి. సింగీతం గారి కథలు అలాంటివే" అని అన్నారు.

సింగీతంతో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ, "పుష్పక విమానం సినిమాను ఫైవ్‌స్టార్ హోటల్‌లో, పూర్తిగా ఏసీలో తీశామని గర్వంగా చెప్పుకుంటాం. అలాగే 'ముంబై ఎక్స్‌ప్రెస్' చిత్రాన్ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం. సింగీతం గారు ఇప్పటి జెన్జీ కంటే ముందుంటారు. ఆయనకు సహాయ దర్శకుడిగా ఉండటానికి నేను ఇప్పటికీ ఇష్టపడతాను. 'సింగ్ గీతం' సినిమాను నేనే నిర్మించిన భావన కలుగుతోంది. ఇది రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మించి ఉంటే బాగుండేదని అనిపించే చిత్రాల్లో ఒకటి. మూడు నెలల ముందే చెప్పి ఉంటే, నేను కూడా యూనిట్‌లో భాగమై ఉండేవాడిని" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.

సినిమా పట్ల ప్యాషన్ ఉండాలని చెబుతూ, "సినిమా అనేది ప్యాషన్‌తో చేయాల్సిన పని. అలా చేస్తేనే పుష్పక విమానం లాంటి ఊహించని విజయాలు వస్తాయి. ఆ ప్యాషన్‌ను మనం సింగీతం గారి నుంచి నేర్చుకోవాలి. ఈ సినిమాను అంత ప్యాషన్‌తో నిర్మిస్తున్న వైజయంతి మూవీస్, స్వప్న గారికి ధన్యవాదాలు. 'సింగీతం' గారి పేరును చాలామంది 'సంగీతం' అని తప్పుగా పలుకుతారు. కానీ ఈ సినిమాతో ఆ కన్ఫ్యూజన్ పోతుంది. ఇకపై అందరూ 'సింగీతం' అనే సరిగ్గా పిలుస్తారు" అని కమల్ హాసన్ తన ప్రసంగాన్ని ముగించారు
Advertisement

సంబంధిత వార్తలు

Kamal HaasanSingeetam Srinivasa RaoSingh Geetham movieNag AshwinVyjayanthi MoviesPushpaka Vimanam

More Telugu News

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01

ఏపీ తీరం వైపు 'మురసు'.. పోర్టుల్లో పెను ప్రమాద హెచ్చరికలు.. దక్షిణ కోస్తాలో రెడ్ అలర్ట్

02 Nov, 18:24

'మురసు' తుపాను ప్రభావం: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ముందస్తు చర్యలు

02 Nov, 18:08

ఏపీ రెండు రకాల వైపరీత్యాలతో సతమతమవుతోంది.. తక్షణమే సాయం అందించండి: కేంద్రబృందంతో చంద్రబాబు

02 Nov, 17:57

2008 నాటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు ఐపీఎల్ క్యాలెండర్ మార్చాలి: లలిత్ మోదీ

02 Nov, 17:43

తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి: అమిత్‌ షా

02 Nov, 17:32

త్రివర్ణ పతాకం చేతబూని హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర.. కదంతొక్కిన కాషాయ శ్రేణులు

02 Nov, 17:30

ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లిపై వివాదం.. ఇస్లాంకు విరుద్ధమన్న మత పెద్దలు

02 Nov, 17:14

షరతులు లేకుండా క్షమాపణ చెప్పాల్సిందే: నటుడు ఇమ్రాన్‌పై హైకోర్టు ఆగ్రహం

02 Nov, 17:10

హైదరాబాద్‌ మెట్రోకు నిధుల జోరు.. ఫేజ్‌-2కు రూ.150 కోట్లు

02 Nov, 17:00

ప్రతి మండలంలో కూటమి జెండాలు రెపరెపలాడాలి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు దిశానిర్దేశం

02 Nov, 16:53

మురసు తుపాను ఎఫెక్ట్: ఏపీలో పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

02 Nov, 16:45

రిలయన్స్‌ దూకుడుతో మార్కెట్ల పరుగులు.. 1,233 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

02 Nov, 16:39
..More Telugu News