ఆఫ్ఘ‌న్‌తో టెస్టు.. 564 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్

Sports
Advertisement
  • ఆఫ్ఘ‌నిస్థాన్‌తో ఏకైక టెస్టులో భారత్ భారీ స్కోరు
  • 564/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన టీమిండియా
  • శతకాలతో మెరిసిన శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్
  • రిషభ్ పంత్, సాయి సుదర్శన్‌ అర్ధశతకాలు
  • ఆప్ఘ‌న్ బౌలర్ సలీం సఫీ 6 వికెట్ల ప్రదర్శన
Advertisement
ఆప్ఘ‌నిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. రెండో రోజు ఆట రెండవ సెషన్‌లో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ (126), కేఎల్ రాహుల్ (101) శతకాలతో కదం తొక్కారు.

ఈ మ్యాచ్‌లో భారత బ్యాట‌ర్లు పూర్తి ఆధిప‌త్యం చేలాయించారు. గిల్, రాహుల్ సెంచరీలతో బలమైన పునాది వేయగా, మిడిలార్డర్‌లోనూ పరుగుల వరద కొనసాగింది. రిషభ్ పంత్ (81), సాయి సుదర్శన్ (81) అర్ధశతకాలతో రాణించి జట్టు స్కోరును మరింత పెంచారు. వాషింగ్టన్ సుందర్ 52 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మహ్మద్ సిరాజ్ 12 బంతుల్లోనే 22 పరుగులు చేయడం విశేషం. అందులో 4 ఫోర్లు, 1 సిక్సు ఉండడం సిరాజ్ దూకుడుకు నిదర్శనం. కొత్త కుర్రాడు మానవ్ సుతార్ 2 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 28 పరుగులు చేశాడు. 

భారత బ్యాటర్లు విజృంభించినప్పటికీ, ఆప్ఘ‌నిస్థాన్ బౌలర్ మ‌హ్మ‌ద్‌ సలీం సఫీ తన అద్భుత‌మైన బౌలింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ భారత జట్టు భారీ స్కోరు సాధించడాన్ని అడ్డుకోలేకపోయాడు. 
Advertisement

సంబంధిత వార్తలు

India Cricket TeamIndia vs Afghanistan TestShubman GillKL RahulMohammad SaleemRishabh PantSai SudharsanWashington SundarCricket Match UpdatesIndia Innings Declaration

More Telugu News

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01

ఏపీ తీరం వైపు 'మురసు'.. పోర్టుల్లో పెను ప్రమాద హెచ్చరికలు.. దక్షిణ కోస్తాలో రెడ్ అలర్ట్

02 Nov, 18:24

'మురసు' తుపాను ప్రభావం: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ముందస్తు చర్యలు

02 Nov, 18:08

ఏపీ రెండు రకాల వైపరీత్యాలతో సతమతమవుతోంది.. తక్షణమే సాయం అందించండి: కేంద్రబృందంతో చంద్రబాబు

02 Nov, 17:57

2008 నాటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు ఐపీఎల్ క్యాలెండర్ మార్చాలి: లలిత్ మోదీ

02 Nov, 17:43

తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి: అమిత్‌ షా

02 Nov, 17:32

త్రివర్ణ పతాకం చేతబూని హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర.. కదంతొక్కిన కాషాయ శ్రేణులు

02 Nov, 17:30

ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లిపై వివాదం.. ఇస్లాంకు విరుద్ధమన్న మత పెద్దలు

02 Nov, 17:14

షరతులు లేకుండా క్షమాపణ చెప్పాల్సిందే: నటుడు ఇమ్రాన్‌పై హైకోర్టు ఆగ్రహం

02 Nov, 17:10

హైదరాబాద్‌ మెట్రోకు నిధుల జోరు.. ఫేజ్‌-2కు రూ.150 కోట్లు

02 Nov, 17:00

ప్రతి మండలంలో కూటమి జెండాలు రెపరెపలాడాలి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు దిశానిర్దేశం

02 Nov, 16:53

మురసు తుపాను ఎఫెక్ట్: ఏపీలో పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

02 Nov, 16:45

రిలయన్స్‌ దూకుడుతో మార్కెట్ల పరుగులు.. 1,233 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

02 Nov, 16:39
..More Telugu News