వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్‌కు భారత జట్లు ఇవే!
- ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ
- సచిన్ తర్వాత అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ రికార్డు
- వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ నియామకం
- హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ పునరాగమనం
- ఆసియా గేమ్స్ జట్టులోకి బుమ్రా
అలాగే యువ ఆటగాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించడం ద్వారా భవిష్యత్తు నాయకుడిగా ఎదిగేందుకు అతనికి ఒక గొప్ప అవకాశం కల్పించామని అగార్కర్ వివరించారు. గాయం కారణంగా గత మార్చి నుంచి ఆటకు దూరమైన సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా తిరిగి జట్టులోకి రాగా.. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా పునరాగమనం చేశాడు. ఐపీఎల్ 2026లో అదరగొట్టిన ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌కు ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లలో అవకాశం దక్కింది. అయితే జపాన్‌లోని నగోయాలో సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడల జట్టులో ప్రిన్స్ యాదవ్ స్థానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి రానుండడం విశేషం.
భారత జట్టు జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్లో ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడుతుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి 11 వరకు ఇంగ్లాండ్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. సీనియర్ పర్యటనలకు ముందు వైభవ్ సూర్యవంశీ జూన్ 9 నుంచి 21 వరకు శ్రీలంకలో జరిగే ట్రై-సిరీస్‌లో ఇండియా-ఏ తరఫున బరిలోకి దిగనున్నాడు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లతో భారత టీ20 జట్టు సరికొత్తగా ముస్తాబైంది.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు భారత టీ20 జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
ఆసియా క్రీడలు-2026కు భారత టీ20 జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్.