బాక్సాఫీస్ ఛాంపియ‌న్ 'పెద్ది'.. రెండు రోజుల్లో ఎంత వ‌సూల్ చేసిందంటే..!

  • రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి భారీ వసూళ్లు
  • రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 181.8 కోట్ల గ్రాస్
  • తొలి రోజు రూ. 135.36 కోట్లు రాబట్టిన సినిమా
  • వసూళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 181.8 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.

తొలి రోజు రూ. 135.36 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. "బాక్సాఫీస్ ఛాంపియన్ పెద్ది థియేటర్లను జయిస్తోంది" అంటూ నిర్మాణ సంస్థ తన పోస్టర్‌లో పేర్కొంది. దేశీయంగానే కాకుండా ఓవర్సీస్‌లోనూ 'పెద్ది' భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం ఇప్పటికే 2.2 మిలియన్ డాలర్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి సత్తా చాటింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. విశ్వసంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

Ram Charan
Peddi movie
Peddi box office collections
Buchi Babu Sana
Janhvi Kapoor
AR Rahman
Vriddhi Cinemas
Peddi two days collections
Peddi worldwide gross
Shiva Rajkumar

More Telugu News