జేడీ చక్రవర్తితో గొడవపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు!
- జేడీ చక్రవర్తి తనకు మంచి స్నేహితుడని చెప్పిన రంభ
- ఆయన తన పెళ్లికి రాకపోవడం తనను ఎంతో బాధించిందని వెల్లడి
- ఆయన కనిపించనప్పుడు గట్టిగా తిట్టేశానన్న రంభ
ఒకప్పుడు టాలీవుడ్‌ను తన గ్లామర్, నటనతో ఊపేసిన సీనియర్ నటి రంభ... తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కో-స్టార్, నటుడు జేడీ చక్రవర్తితో తనకున్న అనుబంధం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. 'బొంబాయి ప్రియుడు' సినిమా షూటింగ్ సమయంలో జేడీ చక్రవర్తితో తనకు మంచి స్నేహం ఏర్పడిందని రంభ చెప్పింది. జేడీ ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారని, అందరినీ ఎంటర్‌టైన్ చేస్తారని, ఆయనతో గడిపిన సమయం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని కొనియాడింది.
కొంతకాలం ఇద్దరం కలిసి ఒక టెలివిజన్ షోలో సందడి చేశామని, ఆ సమయంలో కూడా పాత రోజులను గుర్తుచేసుకుంటూ స్టేజ్ పైన ఎంతో ఫన్ క్రియేట్ చేశామని ఆమె తెలిపింది. ఆ ఎపిసోడ్‌కు ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.