జేడీ చక్రవర్తితో గొడవపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • జేడీ చక్రవర్తి తనకు మంచి స్నేహితుడని చెప్పిన రంభ
  • ఆయన తన పెళ్లికి రాకపోవడం తనను ఎంతో బాధించిందని వెల్లడి
  • ఆయన కనిపించనప్పుడు గట్టిగా తిట్టేశానన్న రంభ

ఒకప్పుడు టాలీవుడ్‌ను తన గ్లామర్, నటనతో ఊపేసిన సీనియర్ నటి రంభ... తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కో-స్టార్, నటుడు జేడీ చక్రవర్తితో తనకున్న అనుబంధం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. 'బొంబాయి ప్రియుడు' సినిమా షూటింగ్ సమయంలో జేడీ చక్రవర్తితో తనకు మంచి స్నేహం ఏర్పడిందని రంభ చెప్పింది. జేడీ ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారని, అందరినీ ఎంటర్‌టైన్ చేస్తారని, ఆయనతో గడిపిన సమయం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని కొనియాడింది.


అయితే, అంతటి ఆత్మీయ స్నేహితుడైన జేడీ చక్రవర్తి... తన పెళ్లికి రాకపోవడం తనను తీవ్రంగా బాధించిందని రంభ ఈ సందర్భంగా వెల్లడించింది. "ఆయన నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి కూడా నా పెళ్లికి రాలేదు. ఆ సమయంలో నేను చాలా అప్సెట్ అయ్యాను. ఆ తర్వాత ఆయన కనిపించినప్పుడు పెళ్లికి ఎందుకు రాలేదంటూ గట్టిగా తిట్టాను కూడా" అని రంభ నవ్వుతూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది.

కొంతకాలం ఇద్దరం కలిసి ఒక టెలివిజన్ షోలో సందడి చేశామని, ఆ సమయంలో కూడా పాత రోజులను గుర్తుచేసుకుంటూ స్టేజ్ పైన ఎంతో ఫన్ క్రియేట్ చేశామని ఆమె తెలిపింది. ఆ ఎపిసోడ్‌కు ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.


తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ రంభ కొన్ని చేదు నిజాలను పంచుకుంది. కెరీర్ ప్రారంభంలో తనకు ఎక్కువగా గ్లామర్ పాత్రలే వచ్చాయని.. ఆ తర్వాత నటిగా తన ప్రతిభను నిరూపించుకున్నప్పటికీ, ఇండస్ట్రీ తనను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనివల్ల ఒక నటిగా తన పూర్తి నటనను ప్రదర్శించే అద్భుతమైన అవకాశాలను కోల్పోవాల్సి వచ్చిందని రంభ అభిప్రాయపడింది.

Rambha
JD Chakravarthy
Bombay Priyudu
Tollywood actress Rambha
Rambha interview
Rambha wedding
Telugu cinema news
Rambha and JD Chakravarthy friendship
Glamour roles in Tollywood
Rambha career reflections

More Telugu News