భారత్‌ గ్లోబల్‌ ఐటీ లీడర్‌.. ఇండియా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లపై పుతిన్‌ ప్రశంసలు

International
Advertisement
  • భారతీయ కోడర్ల ప్రతిభపై పుతిన్ ప్రశంసలు
  • భారత్, రష్యాది సోదర సంబంధమని వ్యాఖ్య
  • పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు భారత్‌ లొంగదని పునరుద్ఘాటన
  • ప్రధాని మోదీ నాయకత్వానికి పుతిన్‌ కితాబు
  • భారత విద్యా ప్రమాణాలూ భేష్‌ అన్న రష్యా అధ్యక్షుడు
Advertisement
భారతదేశ ప్రతిభ, విద్యా ప్రమాణాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు కేవలం దౌత్యపరమైనవి కావని, అవి పూర్తి నమ్మకం, సోదరభావంతో కూడుకున్నవని స్పష్టం చేశారు. రష్యాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక’ (ఎస్‌పీఐఈఎఫ్‌ 2026) ప్లీనరీ సమావేశంలో ‘ఇండియా టుడే’ ప్రతినిధి గీతా మోహన్ అడిగిన ప్రశ్నలకు పుతిన్ ఈ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

భారతదేశానికి ఉన్న మానవ వనరుల శక్తిని పుతిన్ ప్రత్యేకంగా కొనియాడారు. సాంకేతిక రంగంలో భారతీయ ఐటీ నిపుణులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు. ‘‘భారతదేశ ప్రజలు ఎంత ప్రతిభావంతులో, ఎంతటి విద్యావంతులో మాకు బాగా తెలుసు. ముఖ్యంగా కోడింగ్ రంగంలో భారతీయులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. అంతర్జాతీయ ఐటీ పరిశ్రమలో ఇండియానే లీడర్‌’’ అని పుతిన్ పేర్కొన్నారు.

ఇదే వేదికపై భారత వ్యూహాత్మక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పుతిన్‌ అభినందించారు. రష్యాతో సంబంధాలను తగ్గించుకోవాలంటూ అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తెచ్చాయని, భారత్‌ వాటిని తిప్పికొట్టిందని వ్యాఖ్యానించారు. భారత్ లేదా చైనా లాంటి సార్వభౌమాధికారం ఉన్న దేశాలు విదేశాల నుంచి వచ్చే ఎలాంటి ఆదేశాలను ఖాతరు చేయవని, స్వతంత్ర నిర్ణయాధికారమే ఆయా దేశాల బలమని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పుతిన్ కొనియాడారు. ఇది రాత్రికి రాత్రి వచ్చింది కాదని, మోదీ ప్రభుత్వ కష్టానికి నిదర్శనమని చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న 60 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని త్వరలోనే 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి రష్యా కట్టుబడి ఉందని.. క్లీన్ ఎనర్జీ, ఫార్మా, హైడ్రోకార్బన్ రంగాలు ఈ వృద్ధికి దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Vladimir PutinIndia IT sectorIndian software engineersNarendra ModiIndia Russia relationsGlobal IT leaderSPIEF 2026Indian coding talentIndia economic growthStrategic autonomy

More Telugu News

తుపాను ప్రభావిత ఏపీకి కర్ణాటక సాయం.. రంగంలోకి 500 మంది సిబ్బంది

02 Nov, 20:35

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

ఏపీ పుర పోరు: ముగిసిన రీపోలింగ్.. రేపు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

02 Nov, 20:08

'ఓ మైసా రే'.. రష్మిక 'మైసా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

02 Nov, 19:52

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01

ఏపీ తీరం వైపు 'మురసు'.. పోర్టుల్లో పెను ప్రమాద హెచ్చరికలు.. దక్షిణ కోస్తాలో రెడ్ అలర్ట్

02 Nov, 18:24

'మురసు' తుపాను ప్రభావం: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ముందస్తు చర్యలు

02 Nov, 18:08

ఏపీ రెండు రకాల వైపరీత్యాలతో సతమతమవుతోంది.. తక్షణమే సాయం అందించండి: కేంద్రబృందంతో చంద్రబాబు

02 Nov, 17:57

2008 నాటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు ఐపీఎల్ క్యాలెండర్ మార్చాలి: లలిత్ మోదీ

02 Nov, 17:43

తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి: అమిత్‌ షా

02 Nov, 17:32

త్రివర్ణ పతాకం చేతబూని హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర.. కదంతొక్కిన కాషాయ శ్రేణులు

02 Nov, 17:30

ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లిపై వివాదం.. ఇస్లాంకు విరుద్ధమన్న మత పెద్దలు

02 Nov, 17:14

షరతులు లేకుండా క్షమాపణ చెప్పాల్సిందే: నటుడు ఇమ్రాన్‌పై హైకోర్టు ఆగ్రహం

02 Nov, 17:10
..More Telugu News