ప్లాస్టిక్ కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా క్లారిటీ!

National
Advertisement
  • ప్లాస్టిక్ కరెన్సీ చలామణిలోకి రాబోతోందంటూ ప్రచారం
  • ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్న మాట నిజమేనన్న ఆర్బీఐ గవర్నర్
  • 2014లో పార్లమెంటులో ప్లాస్టిక్ నోట్ల ప్రస్తావన
Advertisement

భారతదేశంలో త్వరలోనే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లు చలామణిలోకి రాబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్న మాట వాస్తవమేనని, అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని ఆయన పేర్కొన్నారు.


దేశంలో పేపర్ కరెన్సీ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి గల సాధ్యాసాధ్యాలపై ఆర్‌బీఐ కసరత్తు చేస్తోంది. కాగితపు నోట్ల ముద్రణకు భారీగా ఖర్చు అవ్వడం, అవి త్వరగా పాడైపోయి చలామణి నుంచి తొలగించాల్సి రావడం వంటి కారణాల వల్లే ఈ ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్లాస్టిక్ నోట్ల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సాంకేతిక, ఆపరేషనల్ సమస్యలపై ఆర్బీఐ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.


నిజానికి, ప్లాస్టిక్ నోట్ల ప్రస్తావన ఈనాటిది కాదు. 2014 ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై పార్లమెంటుకు సమాచారం అందించింది. భౌగోళిక, వాతావరణ వైవిధ్యాలను పరీక్షించడానికి దేశవ్యాప్తంగా ఐదు నగరాలను (కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్) ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా రూ. 100 కోట్ల విలువైన ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలని భావించారు. కానీ, అప్పట్లో కొన్ని సాంకేతిక, నిర్వహణ లోపాల వల్ల ఈ ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పుడు ఆర్‌బీఐ మళ్లీ ఈ ఫైల్‌ను కదిలించడంతో త్వరలోనే దేశంలో ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వస్తాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Sanjay MalhotraRBIPlastic currency notesPolymer currency IndiaReserve Bank of IndiaIndian currency updatesPaper currency replacementSanjay Malhotra RBI clarificationPlastic notes pilot projectFuture of Indian currency

More Telugu News

హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 20:59

'అర్నబ్' తుపానుతో పోలిస్తే 'మురసు' తీవ్రత తక్కువే.. అయినా అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

02 Nov, 20:47

తుపాను ప్రభావిత ఏపీకి కర్ణాటక సాయం.. రంగంలోకి 500 మంది సిబ్బంది

02 Nov, 20:35

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

ఏపీ పుర పోరు: ముగిసిన రీపోలింగ్.. రేపు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

02 Nov, 20:08

'ఓ మైసా రే'.. రష్మిక 'మైసా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

02 Nov, 19:52

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01

ఏపీ తీరం వైపు 'మురసు'.. పోర్టుల్లో పెను ప్రమాద హెచ్చరికలు.. దక్షిణ కోస్తాలో రెడ్ అలర్ట్

02 Nov, 18:24

'మురసు' తుపాను ప్రభావం: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ముందస్తు చర్యలు

02 Nov, 18:08

ఏపీ రెండు రకాల వైపరీత్యాలతో సతమతమవుతోంది.. తక్షణమే సాయం అందించండి: కేంద్రబృందంతో చంద్రబాబు

02 Nov, 17:57

2008 నాటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు ఐపీఎల్ క్యాలెండర్ మార్చాలి: లలిత్ మోదీ

02 Nov, 17:43

తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి: అమిత్‌ షా

02 Nov, 17:32

త్రివర్ణ పతాకం చేతబూని హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర.. కదంతొక్కిన కాషాయ శ్రేణులు

02 Nov, 17:30
..More Telugu News