స్వయంగా మాట్లాడి పరిష్కరిస్తా.. మంత్రి రాజీనామాపై డీకే శివకుమార్
- కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో లుకలుకలు
- అడిగిన శాఖ ఇవ్వలేదని మంత్రుల అసంతృప్తి
- మంత్రి పదవికి రాజీనామా చేసిన రామలింగారెడ్డి
- రామలింగారెడ్డి తనకు ఆప్త మిత్రుడన్న సీఎం
మంత్రి రామలింగారెడ్డి రాజీనామాతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో రేగిన కలకలంపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. రామలింగారెడ్డి తమకు సీనియర్ నేత మాత్రమే కాదని, తనకు అత్యంత ఆప్తమిత్రుడని సీఎం పేర్కొన్నారు. శాఖల కేటాయింపుపై ఆయనకున్న అసంతృప్తి నేపథ్యంలో, తానే స్వయంగా మాట్లాడి, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని వెల్లడించారు.
అయితే కర్ణాటక సర్కారులో కేవలం రామలింగారెడ్డి ఒక్కరే కాకుండా.. డీకే శివకుమార్ శాఖల కేటాయింపులపై మరికొందరు సీనియర్ మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కీలకమైన హోం, ఆర్థిక, మైనింగ్ వంటి శాఖలు తమకు దక్కకపోవడంపై కనీసం నలుగురు సీనియర్ మంత్రులు డీకేఎస్‌పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. వీరంతా త్వరలోనే ఢిల్లీ వెళ్లి అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మరోవైపు తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే ఉంటానని, ఇప్పుడు బెంగళూరు అభివృద్ధి శాఖ ఇచ్చినా ఒప్పుకోనని రామలింగారెడ్డి భీష్మించుకు కూర్చోవడం డీకే శివకుమార్‌కు సవాల్‌గా మారింది. ఇక ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విభేదాలు ముదిరిపోయాయని, ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన ఆ పార్టీ మారదని వ్యాఖ్యానించారు.