400 తిరస్కరణలు, వీసా టెన్షన్.. అయినా గూగుల్‌లో జాబ్ కొట్టిన హైదరాబాద్ కుర్రాడు!

Abhijay Vuyyuru Hyderabad boy lands Google job after 400 rejections and visa tension
  • హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొందిన భారతీయ విద్యార్థి అభిజయ్ వుయ్యూరు
  • 400కు పైగా ఉద్యోగ తిరస్కరణలను ఎదుర్కొని తీవ్ర ఒత్తిడి
  • అమెరికా వీసా గడువు ముంచుకొస్తున్న తరుణంలో పట్టుదలతో ప్రయత్నాలు
  • చివరకు గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం సాధన
  • స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న అభిజయ్ ప్రయాణం
పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు ఓ హైదరాబాద్ కుర్రాడు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొంది, 400కు పైగా ఉద్యోగ తిరస్కరణలు ఎదుర్కొని, వీసా గడువు ముంచుకొస్తున్నా వెరవకుండా.. చివరకు టెక్ దిగ్గజం గూగుల్‌లో ప్రతిష్టాత్మక ఉద్యోగం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

వివరాల్లోకి వెళితే.. అభిజయ్ వుయ్యూరు అనే యువకుడు 2024లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందాడు. అయితే, క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో అతడికి ఉద్యోగం రాలేదు. అంతర్జాతీయ విద్యార్థి కావడంతో, చదువు పూర్తయ్యాక 90 రోజుల్లోగా ఉద్యోగం సంపాదించకపోతే అమెరికా విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్రమైన ఒత్తిడి మధ్య ఆయన ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

ప్రస్తుతం ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ మార్కెట్ సవాలుగా మారడంతో, అభిజయ్ వందల కొద్దీ కంపెనీలకు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయింది. సుమారు 400కు పైగా కంపెనీలు అతడి అప్లికేషన్‌ను తిరస్కరించాయి. ఈ క్రమంలో తన వ్యూహాన్ని మార్చుకున్న అభిజయ్, హార్వర్డ్ పూర్వ విద్యార్థులతో నెట్‌వర్కింగ్‌పై దృష్టి పెట్టాడు. ఈ ప్రయత్నంలో భాగంగా హార్వర్డ్‌లోని తన క్లాస్‌మేట్ ద్వారా లభించిన రిఫరెన్స్ అతడికి కీలకమైన అవకాశం కల్పించింది.

ఆ రిఫరెన్స్ ద్వారా గూగుల్‌కు చెందిన యూట్యూబ్ విభాగంలో ఇంటర్వ్యూలకు హాజరై, చివరికి ప్రొడక్ట్ మేనేజర్ ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నాడు. అతడి పట్టుదల, స్ఫూర్తిదాయక ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.
Go Back to Shorts
Abhijay Vuyyuru
Google
Harvard Business School
Hyderabad
YouTube Product Manager
Job Rejections
US Visa Deadline
MBA Career Success
Networking
Tech Jobs

More Telugu News