కృష్ణ ఫ్యాన్స్ ను మెప్పిస్తున్న కుర్రాడి కటౌట్!
- హీరోగా ఎంట్రీ ఇస్తున్న జయకృష్ణ
- తొలి సినిమాగా 'శ్రీనివాస మంగాపురం'
- ఇదే సినిమాతో రషా థడాని పరిచయం
- జులై 9న విడుదల కానున్న సినిమా
' RX 100' సినిమాతో ఒక భారీ హిట్ ఇచ్చిన అజయ్ భూపతి, ఆ తరువాత కూడా తన మార్క్ సినిమాలను ఆడియన్స్ కి పరిచయం చేశాడు. ఆయన దర్శకత్వం వహించిన 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్నాడు. యాక్షన్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. రీసెంటుగా వదిలిన ఈ సినిమా 'గ్లింప్స్' చూసినవాళ్ల నుంచి జయకృష్ణకి మంచి మార్కులే పడుతున్నాయి. కటౌట్ కరెక్టుగానే ఉందని చెప్పుకుంటున్నారు. సైడ్ నుంచి అచ్చు రమేశ్ బాబులా కనిపిస్తున్న జయకృష్ణ, నటన పరంగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటాడేమో చూడాలి.
ఈ సినిమాతో రవీనా టాండన్ కూతురు 'రషా థడాని' హీరోయిన్ గా పరిచయమవుతోంది. బాలీవుడ్ బ్యూటీ అనిపించుకున్న రవీనాకి తెలుగులో 'బంగారు బుల్లోడు' .. 'రథసారధి' వంటి హిట్స్ ఉన్నాయి. ఇక ఇప్పటి యూత్ ను అలరించడానికి రషా థడాని సిద్ధమవుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, జులై 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో ఈ కొత్త జంట దూసుకుపోతుందేమో చూడాలి.