డాలస్లో మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించిన కోమటి జయరాం
- ఉత్తర అమెరికాకు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతల తర్వాత తొలి పర్యటన
- జాతిపితకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు
- ప్రవాస భారతీయుల ఐక్యతకు ఈ స్థలి నిలువెత్తు నిదర్శనమని ప్రశంస
- జయరాంను సత్కరించిన గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర
ఈ కార్యక్రమానికి హాజరైన జయరాంకు మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర, గవర్నెన్స్ బోర్డు సభ్యులు అనంత్ మల్లవరపు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జయరాంను జ్ఞాపికతో సత్కరించారు.
అనంతరం జయరాం మాట్లాడుతూ, ఈ గాంధీ స్మారక స్థలి ఒక స్ఫూర్తిదాయకమైన యాత్రాస్థలమని కొనియాడారు. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అనేక మంది రాజకీయ నాయకులు సందర్శించిన పవిత్ర స్థలి ఇది. ప్రవాస భారతీయుల ఐక్యతకు ఈ మెమోరియల్ ఒక నిలువెత్తు నిదర్శనం" అని అన్నారు. ఈ మహత్కార్యాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఆయన బృందానికి జయరాం ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త రామ్ గుళ్ళపల్లితో పాటు పలువురు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.