ఆవకాయ అంతకాలం ఎలా నిల్వ ఉంటుంది? ఐఐటీ ప్రొఫెసర్‌ మాటల్లో..

Why does mango pickle have long shelf life
  • ఉప్పు ముక్కల్లోని తేమను తగ్గిస్తుందని ప్రొఫెసర్‌ వివరణ
  • బ్యాక్టీరియా పెరగకుండా ఉప్పు అడ్డుకుంటుందని వెల్లడి
  • తడి తగిలితే పచ్చడికి బూజు వచ్చే అవకాశం
  • ఆవపొడి, కారం రక్షణగా నిలుస్తాయని సైన్స్‌ చెబుతోంది
  • నూనె గాలి తగలకుండా చూస్తుందని వివరణ
వేసవి రాగానే తెలుగు ఇళ్లలో ఆవకాయ ఘుమఘుమలు మొదలవుతాయి. ఏడాది పొడవునా పాడవకుండా ఉండే ఈ పచ్చడి వెనుక కేవలం బామ్మల చేతి మహిమే కాదు.. అద్భుతమైన సైన్స్ దాగి ఉందని ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ వివరించారు. ఆవకాయ అంతకాలం నిల్వ ఉండటం వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలు ఆయన మాటల్లోనే..

ఉప్పుతోనే అసలు యుద్ధం
పచ్చి మామిడి ముక్కల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరగడానికి అనుకూలం. ముక్కలకు ఉప్పు చేర్చినప్పుడు ‘ఆస్మాటిక్ డీహైడ్రేషన్’ ప్రక్రియ జరుగుతుంది. ముక్కల్లోని తేమను ఉప్పు బయటకు లాగేస్తుంది. అయితే ముక్క గట్టి పడకుండా అందులోని నీటి యాక్టివిటీని మాత్రమే ఉప్పు తగ్గిస్తుంది. సూక్ష్మజీవులు పెరగకుండా ఉప్పు ఇక్కడ ప్రధాన సైనికుడిలా పనిచేస్తుందని ప్రొఫెసర్ చెప్పారు.

ఆవపొడి, నూనె రక్షణ
పచ్చడి తయారీలో తడి తగలకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కొద్దిగా నీరు చేరినా బూజు వచ్చే ప్రమాదం ఉంది. పచ్చడిలో వాడే ఆవపొడి, కారం, మెంతులు రక్షణ వలయంగా మారి బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి. ఇక నువ్వుల నూనె ముక్కలకు గాలి, తేమ తగలకుండా కోటింగ్‌లా పనిచేస్తుంది. నూనె కేవలం సువాసన కోసమే కాదు.. పచ్చడిని ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తుందని వివరించారు. తరతరాల ప్రయోగాలతోనే ఈ అద్భుత సాంకేతికత పుట్టిందని ప్రొఫెసర్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Mango
Mango Pickle
IIT
IIT Professor
Avakaya
Science Behind Avakaya

More Telugu News