ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. 12 మందిని కాపాడిన సిబ్బంది
- మరి కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానం
- మూడో అంతస్తులో నిర్మాణ పనులే కారణమని ప్రాథమిక అంచనా
- సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపిన సీఎం రేఖా గుప్తా
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సైదులాజాబ్ ప్రాంతంలో ఐదంతస్తుల వాణిజ్య భవనం కుప్పకూలింది. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో, సహాయక బృందాలు ఇప్పటివరకు 12 మందిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
శనివారం రాత్రి ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఇతర విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రాత్రంతా సహాయక చర్యలను కొనసాగించాయి. కూలిన భవనంలో ఓ కోచింగ్ సెంటర్, పలు కార్యాలయాలు, కేఫ్‌లు ఉన్నాయని తెలిసింది. భవనం పక్కనే ఉన్న ఓ క్యాంటీన్‌పై శిథిలాల పడటంతో అక్కడ ఉన్న విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు.
భవనం మూడో అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండటమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, భవనం ఇప్పటికే శిథిలావస్థలో ఉందని స్థానికులు చెబుతున్నారు. 12 మందిని రక్షించామని, ఇక శిధిలాల కింద ఎవరూ లేరని భావిస్తున్నామని, అయితే రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే వరకూ కచ్చితంగా చెప్పలేమని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.